టాలీవుడ్ హ్యాండసమ్ హంక్ దగ్గుబాటి రానాకు తెలుగులో కాకుండా మంచి క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాలతో ఏకంగా ఇండియాలో కూడా పాపులర్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ కూడా రానాకు మంచి గుర్తింపు ఇస్తోంది. పలు హిందీ సినిమాల్లో నటించాడు కూడా. అంతేకాకుండా హిందీ సినీ వర్గాలతో, మీడియాతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం బాలీవుడ్ మీడియా ముంబయ్ మిర్రర్ పై ఆగ్రహంగా ఉన్నాడు. రానాపై వారు రాసిన ఆర్టికలే ఇందుకు కారణమైంది.

 

 

బాలీవుడ్ లోని టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అయిన క్వాన్ కో ఫౌండర్ అయిన అనిర్బన్ దాస్ బ్లా తో రానాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయ్ మిర్రర్ లో రాయడమే రానా ఆగ్రహానికి కారణమైంది. క్వాన్ గ్రూప్ లో నలుగురు మహిళా ఉద్యోగులపై అనిర్బన్ గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరు ఆత్మహత్యాయత్నం కూడా చేయడంతో ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కంపెనీ నుంచి ఉద్వాసనకు గురైన అనిర్బన్ ఓ ఫుడ్ రెస్టారెంట్ పెట్టే యోచనలో అనిర్బన్ ఇచ్చిన పార్టీకి అనేక మంది సెలబ్రిటీలతో పాటు రానా కూడా హాజరయ్యారు.

 

 

ఈ వార్త ముంబయ్ మిర్రర్ లో పబ్లిష్ కావడంతో నెటిజన్లు రానాపై ప్రశ్నలు కురిపించారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారా.. ఇది సమంజసమేనా? అంటూ కామెంట్లు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రానా ముంబయ్ మిర్రర్ ను ఉద్దేశిస్తూ.. ‘వార్త రాసే ముందు వాస్తవాలు తెలుసుకుని రాయండి. మీకు నిజాలు తెలియాలంటే నా నెంబర్, పీఆర్ టీమ్ అందుబాటులో ఉంది. నాకు కాల్ చేస్తారని ఆశిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ అంశం ఇంటర్నెట్ లో రౌండ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: