ఇండస్ట్రీ హిట్ సినిమా రికార్డును కంటిన్యూ చేస్తూ మరో ఇండస్ట్రీ హిట్ వెంటనే ఇచ్చిన వారు లేరని టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. ఇంద్ర మ్యాజిక్ ను ఠాగూర్ ద్వారా వెంటనే రిపీట్ చేసిన ఘనత ఒక్క చిరంజీవికి మాత్రమే దక్కింది. అయితే.. ఇప్పటి వరకూ టాలీవుడ్ లో జరగని ఓ సంఘటన జరుగబోతోంది. ఓ హీరో, దర్శకుడు వేర్వేరుగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చి ఇప్పుడు ఒకే ప్రాజెక్టుకు కలిసి చేయడం ఆసక్తి రేపుతోంది.

 

 

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక్కడ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం ఏంటంటే.. సుకుమార్ 2018లో రామ్ చరణ్ హీరోగా చేసిన రంగస్థలం ద్వారా భారీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ మూవీ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా బన్నీతోనే. బన్నీ కూడా లేటెస్ట్ గా అల.. వైకుంఠపురములో ద్వారా రంగస్థలం రికార్డులు బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. వీరిద్దరూ వేర్వేరుగా ఇండస్ట్రీ హిట్లు కొట్టి తమ తర్వాతి ప్రాజెక్టుగా ఒకే సినిమా చేస్తూండడమే ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం.

 

 

సుకుమార్, బన్నీ వేర్వేరు సినిమాలు చేస్తున్నట్టయితే ఇండస్ట్రీ సెంటిమెంట్ గురించి ఎక్కువగా చర్చ జరిగేది. కానీ వేర్వేరుగా రికార్డులు బ్రేక్ చేసిన ఇద్దరూ తమ తర్వాతి ప్రాజెక్టుగా ఒకే సినిమాకు పని చేయడం విశేషం. పైగా బన్నీ రికార్డులు తిరగరాసింది ప్రస్తుతం తన సినిమాను డైరక్ట్ చేస్తున్న సుకుమార్ సినిమా కావడం చర్చనీయాంశమైంది. ఇటువంటి మ్యాజిక్ టాలీవుడ్ లో జరిగిన దాఖలాలు లేవని అంటున్నారు. మరి బన్నీసుకుమార్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారా.. కొత్త సెంటిమెంట్ క్రియేట్ చేస్తారా అనేది చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: