ఇప్పటివరకు టాప్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను తీసి చాలామంది దర్శకులు పాత సినిమాలను లేదంటే విదేశీ సినిమాలను కాపీ కొడుతూ వారి కాపీకి అనుసరణ అనే గౌరవప్రదమైన పేరు పెట్టి కోట్లల్లో పారితోషికం తీసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా చలామణి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాను తీస్తున్న క్రిష్ చాల తెలివిగా ఒకవీడియో గేమ్ ను కాపీ చేసినట్లుగా ఇండస్ట్రీలో గాసిప్పులు గుప్పుమంటున్నా యి.


 
ఎన్టీఅర్ బయోపిక్ ఘోర పరాజయం తరువాత టాప్ హీరోలు ఎవరు కనీసం క్రిష్ చెప్పే కథలను కూడ వినలేదు. అయితే సినిమాల జయాపజయాలను పెద్దగా పట్టించుకోని పవన్ కళ్యాణ్ క్రిష్ కు అవకాశం ఇవ్వడమే కాకుండా ఏకంగా తనపై 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ మూవీని తీసే అవకాశం పవన్ క్రిష్ కు ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. చారిత్రక నేపధ్యంతో ఉండే ఈకథ చరిత్రలోని మొగలాయిల కాలంనాటిది అని అంటున్నారు. 

 

ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈమూవీకి సంబంధించి సముద్రంలో ఓడలో తరలిపోతున్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఫైట్ ని పవన్ పై చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈఫైట్ సినిమాకే హైలైట్ గా మారనున్నది అని అంటున్నారు. అయితే ఈభారీ ఫైట్ సీన్ కు ‘షాడో ఫైటర్’ అనే పాపులర్ వీడియో గేమ్ స్ఫూర్తి అన్న ప్రచారం జరుగుతోంది. ఆ వీడియో గేమ్ లో ఉండే భారీ యాక్షన్ సన్నివేశాలను క్రిష్ మక్కీకి మక్కీగా దించేస్తున్నట్లు సమాచారం. 

 

థియేటర్ లో ఈ ఫైట్ వచ్చినటప్పుడు విజిల్స్ పడడం ఖాయం అని అంటున్నారు. ఈయాక్షన్ సన్నివేశంలో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించేడప్పుడు పవన్ కళ్యాణ్ సాహశాలు గగుర్పొడిచేలా ఉంటాయి అని అంటున్నారు. అంతేకాదు ఈదొంగతనం సన్నివేశంలో పవన్ మార్క్ మ్యానరిజమ్ తో క్రిష్ ప్రతి సీను చాల శ్రద్ధపెట్టి తీస్తున్నాడని టాక్. ఈ మూవీకి కీరవాణి అందించే సంగీతం అదనపు ఆకర్షణగా ఉండే విధంగా ట్యూన్స్ విషయంలో చాల శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. అయితే నేటితరం ప్రేక్షకులు చారిత్రాత్మక సినిమాలను ఎంతబాగా తీసినా పెద్దగా ఆదరించడం లేదు అన్నవిషయం ‘మణికర్ణిక’ ‘సైరా’ సినిమాలు రుజువు చేసాయి. అయితే ఈవిషయాలను పట్టించు కోకుండా క్రిష్ సాహసం చేయడమే కాకుండా ఏకంగా వచ్చేఏడాది సంక్రాంతికి ఈమూవీని ‘ఆర్ ఆర్ ఆర్’ కు పోటీగా విడుదల చేస్తారు అని లీకులు రావడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోం

మరింత సమాచారం తెలుసుకోండి: