ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది అనేది ఎంత నిజమో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. బుజ్జి పాపాయి అయినా, విద్యార్ధి అయినా, కాలేజీ కుర్రాళ్లు అయినా, ఉద్యోగస్తులయినా, హీరోలయినా, రాజకీయ నాయకులైనా, దేశాధినేతలైనా.. వారి ఉన్నతి, బాగు కోరేది ఓ స్త్రీ. తల్లి, అక్క, చెల్లి, భార్య, కూతురు.. ఇలా ప్రతి దశలోనూ ఓ వ్యక్తిని ప్రభావితం చేసి జీవితంలో ముందుకు నడిపించేది ఓ స్త్రీ మూర్తే అనేది నిజం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ ఇందుకు మినహాయింపు కాదు కదా.. తనదైన శైలిలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు.

 

 

‘ఈ ముగ్గురూ నా జీవిత గమనాన్నే మార్చేశారు. వీరితో పాటు మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలంతా మరింత శక్తివంతంగా మారాలి’ అని శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ కు తల్లి ఇందిర, భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఫొటోలను యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఓ ఫంక్షన్ లో మహేశ్ తల్లి చేయి పట్టుకుని తీసుకెళ్తున్న ఫొటో అప్పట్లో ఆసక్తి రేకెత్తించింది. ఎంత సూపర్ స్టార్ అయినా ఓ తల్లికి కొడుకే కదా అనిపించిన పిక్ అది.

 

 

ప్రేమించి పెళ్లి చేసుకున్న నమ్రతను మహేశ్.. తన ప్రతి అడుగులోనూ ప్రోత్సహిస్తూ ఉంటుందని చెప్తూనే ఉంటాడు. కూతురు సితారా రాకతో తనకు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పే మహేశ్ తన ఆటపాటలకు ముద్దు మాటలకు మురిసిపోతూంటాడు. ఈ ముగ్గురూ తన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ మహిళా దినోత్సవం సందర్భంగా విసెష్ చెప్తున్నాడు ఈ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్.

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: