టాలీవుడ్ లో ఉన్న నలుగురు సూపర్ స్టార్స్ లో అక్కినేని నాగార్జునకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్ లో కూడా మంచి పరిచయాలు ఉన్న కింగ్ నాగార్జున అక్కడ చాలా సినిమాలు చేశాడు. రీసెంట్ గా బ్రహ్మాస్త్ర అనే భారీ మల్టీస్టారర్ సినిమాలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అలాగే మళయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన మరక్కార్ సినిమాలో కూడా ఓ పాత్ర పోషిస్తున్నట్టు ఆమధ్య నాగార్జునే స్వయంగా ప్రకటించాడు.

 

 

కానీ.. రీసెంట్ గా రిలీజైన మరక్కార్ ట్రైలర్ లో నాగార్జున కనిపించ లేదు. రీసెంట్ గా రిలీజైన రెండున్నర నిముషాల ట్రైలర్ లో దక్షిణాది భాషల నుంచి యాక్టర్స్ చాలామంది ఉన్నారు. తెలుగు నుంచి ఎవరూ లేరు. మరి నాగార్జున పాత్రను సీక్రెట్ గా ఉంచారా.. లేక నాగార్జున నటించ లేదా అనేది తెలియాల్సి ఉంది. మరక్కార్ దర్శకుడు ప్రియదర్శన్ తో నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్నాయి. 1990లో ప్రియదర్శన్ తో నిర్ణయం సినిమా కూడా చేశాడు. అఖిల్ హీరోగా వచ్చిన హలో సినిమాలో కూడా ప్రియదర్శన్ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది.

 

 

మరి ఇన్ని పరిచయాలు, సౌత్ లో, నార్త్ లో కూడా క్రేజ్ ఉన్న నాగార్జున మరక్కార్ లో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ ప్రకారం మరక్కార్ చాలా భారీగా తెరకెక్కింది. ఇటువంటి సినిమాలో తెలుగు నటుడు.. అందులోనూ నాగార్జున  నటించి ఉంటే సినిమాకు తెలుగులో మంచి హైప్ వచ్చేది. దీనికి కారణం తెలియాల్సి ఉంది. మరక్కార్ ట్రైలర్ ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రిలీజ్ చేశారు.  

                           

 

మరింత సమాచారం తెలుసుకోండి: