సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే పరిస్థితి ఏర్పడింది.  ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో ఇంత పెద్దదిగా చూపించడం.. జనాలను భయ భ్రాంతులను చేయడం కామన్ అయ్యింది.  ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా పై కూడా ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయి.  లేని పోని ప్రచారాలు వ్యాపింపజేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూసి ప్రజలను భయాందోళనకు గురి అవుతున్నారు.  ప్రపంచంలో ఇప్పటి వరకు 097కు చేరగా, ఇటలీలో 233, ఇరాన్‌లో 194 మంది ప్రాణాలు కోల్పోయారు.  అయితే భారత్ లో కూడా కరోనా ఎఫెక్ట్ బాగానే ఉంది.

 

కాకపోతే ఇప్పటి వరకు ఒకరు మాత్రమే చనిపోయారని వార్తలు వస్తున్నాయి. 39 మందికి కరోనా ఉన్నట్లు నిర్థారణ అయ్యింది.  కేరళాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకినట్లు చెప్పి వార్తలు వచ్చాయి.  తాజాగా కరోనా పై సినీనటుడు, జనసేన నేత నాగబాబు స్పందిస్తూ ట్వీట్ చేశారు.  ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్టు గా చెబుతూ జనాలను భయపెడుతున్నారని అన్నారు. కరోనా వైరస్‌ దాడి కన్నా ఆ వైరస్‌ భయం వల్లే ప్రపంచంలో మృతుల సంఖ్య పెరిగిపోయింది' అని నాగబాబు చెప్పుకొచ్చారు.

 

అయితే నాగ బాబు చేసిన ట్విట్ కి కొంత మంది వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.  అయ్యా నాగబాబు ముందు కరోనా స్పెలింగ్ ఏంటో సరిగా తెలుసుకొని ట్విట్ చేయి అని కామెంట్ చేశారు.  . 'ఏం మాట్లాడుతున్నారు బాబు గారూ' అంటూ మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం కరోనాపై సెలబ్రెటీలు స్పందిస్తూ కొంత మంది తమకు తోచిన చిట్కాలు ఇస్తున్నారు.  మరికొంత మంది కరోనాకు భయపడాల్సింది ఏమీ లేదని.. తగు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి రోగాలు మన ధరి చేరవని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: