గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది.   కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇవ్వాలని చూసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కి అత్యధిక సీట్లు కట్టబెట్టారు.  అంతే కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంత మంది నేతలు సైతం టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్దిపై ఆకర్షితులైన టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  కొంత కాలంగా టీఆర్ఎస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తుతున్నాయి.  ఇక నిన్న కొనసాగిన బడ్జెట్ పై రక రకాల కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

తాజాగా ఈ విషయంపై మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ప్రతిపక్షాల విషయంలో ఆచీ.. తూచీ మాట్లాడే తలసాని ఈసారి కాస్త డోస్ పెంచారు. మా పార్టీనేతలు ప్రతిపక్ష నేతల మాదిరిగా కుక్కల్లా అరవబోమని ఆయన వ్యాఖ్యానించారు. తమకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయని, వాటిని తప్పకుండా నిర్వర్తిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని తెలిపారు. 

 

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ని కొనియాడుతున్నారని.. లబ్ది పొందిన వారు ఆ పార్టీకే పట్టం కట్టాలని చూస్తరని.. అలాగే టీఆర్ఎస్ కి పట్టం కట్టారని అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హతకు మించి ఎప్పుడూ మాట ఇవ్వరని.. ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ తన మాటకు కట్టుబడి ఉంటారని అన్నారు.  రాష్ట్రం ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉందని అయినప్పటికీ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆర్థిక రంగ నిపుణులు కూడా స్వాగతించారని ఆయన గుర్తు చేశారు. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణ మరింత అభివృద్ది చెందుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: