జయలలిత ఈ పేరు అందరికి సుపరిచితమే..నటిగా, నర్తకిగా, ఆర్టిస్ట్ గా, రాజకీయా నాయకురాలుగా, ఒక రాష్ట్రాన్ని ఏలిన మహిళ జయలలిత..సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నది..  1961 నుంచి 1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. నాట్యంలో కూడా ఆమెది పై చేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.హీరోయిన్‌గా ఆమె మొదటిసారిగా నటించిన కన్నడ చిత్రం చిన్నదా గంబి. ఈ చిత్రం 1964లో విడుదలైంది. ఆ తర్వాత ఏడాది తమిళంలో విడుదలైన వెన్నెరా అదాయి చిత్రంలో నటించారు. అదే ఏడాది తెలుగులో వచ్చిన ‘మనుషులు మమతలు' చిత్రంలో నటించారు.

 

IHG

 

 అలా జయలలిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 140 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డుతోపాటు పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా ఆమె సొంతం చేసుకున్నారు.ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు..అన్నాడిఎంకె అధ్యక్షురాలిగా, ప్రతిపక్ష నేతగా కూడా ఆమె తమిళ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పాషించారు. ప్రముఖ సినీ నటుడు, అన్నాడిఎంకె అధినేత ఎంజి రామచంద్రన్ 1977లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1982 ఏఐఏడిఎంకె పార్టీలో చేరారు. 1983లో తిరుచండుర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అయితే 1984లో ఆమెను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపిక చేశారు. 

 

IHG


దీంతో ఆమె ఏఐఏడిఎంకె తరపున రాజ్యసభలో అడుగుపెట్టారు. 2011లో ముచ్చటగా మూడోసారి జయలలిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 'అమ్మ‘ పేరిట అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు.  ఆడవాళ్ళకి, విద్యార్ధులకి, నిరుపేదలకు అండగా ఉండి ఎన్నో మంచి పధకాలు తీసుకుని వచ్చారు.. అయితే ఒకానొక సందర్భంలో అవినీతి ఆరోపణల నిందలు కూడా వచ్చాయి జయలలిత మీద. అన్ని ఒడిదుడుకులు తట్టుకుని దమళ్లీ ఆమె  మే 2015 నుంచి డిసెంబరు 2016 లో మరణించే దాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది... ఆమె మరణాన్ని యావత్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. తమిళ ప్రజలు అయితే అమ్మ అని పిలిచేవాళ్ళు..అమ్మ లేని రాష్ట్రాన్ని ఉహించుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చారు.. ఇప్పటికి ఏప్పటికి  అమ్మ స్థానం అమ్మదే..

మరింత సమాచారం తెలుసుకోండి: