సినిమా ధియేటర్లు అన్నీ జనం లేక వెలవెల పోతున్నాయి. దీనికితోడు పరీక్షల హడావిడి కరోనా భయాలు ప్రస్తుతం సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇది చాలదు అన్నట్లుగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. 


దీనితో అందరి దృష్టి ఉగాది పండుగ కంటే కరోనా పైనా ఎన్నికల పైనా ఎక్కువగా ఉంది. ఈ నేపధ్యంలో ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ మార్చి 25న రాబోతున్న నాని ‘వి’ మూవీ విడుదలను వాయిదా వేయమని నిర్మాత దిల్ రాజ్ పై ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేకమంది బయ్యర్లు ఒత్తిడి పెంచుతున్నట్లు టాక్. 


అంతేకాదు ‘వి’ మూవీకి భారీ బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఇలాంటి వ్యతిరేక పరిస్థితులలో ఈ మూవీ విడుదలైతే తమకు భారీ నష్టాలు వస్తాయని అందువల్ల ఈమూవీ విడుదల ఆలోచనలను వచ్చే నెలకు వాయిదా వేయమని దిల్ రాజ్ కు బయ్యర్ల దగ్గర నుండి గట్టిగా సూచనలు అందుతున్నట్లు టాక్. దీనికితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయడంతో నడుస్తున్న కాలం ‘వి’ కి ఏమాత్రం అనుకూలంగా లేదు అన్న విషయాలు దిల్ రాజ్ కు కూడ అర్ధం అయినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ‘జాను’ మూవీతో భారీగా నష్టపోయిన దిల్ రాజ్ మరొకసారి వ్యతిరేక పరిస్థితులలో ప్రయోగం చేయడం మంచిదికాదు అన్న సలహాలు కూడ దిల్ రాజ్ కు అందుతున్నట్లు టాక్. అయితే ఏప్రిల్ 2 నుండి అనుష్క ‘నిశ్శబ్దం’ తో మొదలై భారీ అంచనాలు ఉన్న సినిమాలు అన్నీ క్యూ కడుతున్న నేపధ్యంలో ‘వి’ కి సరైన డేట్ మళ్ళీ దొరకడం కష్టం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సాహసం చేయడం అంత మంచిదా కాద అన్న విషయమై దిల్ రాజ్ తన సన్నిహితులతో లోతైన చర్చలు కొనసాగిస్తుట్లు వార్తలు ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: