తెలుగు, తమిళ ఇండస్ట్రీలో చియాన్ విక్రమ్ అంటే ఓ ప్రత్యేకత ఉంటుంది. వైవిద్యభరిత పాత్రల్లో నటిస్తూ విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో పాత్రపై ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచాడు.  మొదట తెలుగు తెరపై కనిపించిన విక్రమ్ ఇక్కడ పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో తమిళ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.  అక్కడ వరుస హిట్స్ తో దుమ్మురేపాడు. రజినీకాంత్, విజయ్, అజిత్ తర్వాత విక్రమ్ కి తమిళ నాట మంచి పేరు వచ్చింది.  తెలుగు లో ఆయన నటించిన అపరిచితుడు బ్లాక్ బస్టర్ అయినప్పటి నుంచి తమిళంలో వచ్చిన ప్రతి చిత్రం తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో నట వారసులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విక్రమ్ తనయుడు ధృవ్ కూడా హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  తెలుగు లో వంగ సందీప్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళ్ లో డబ్ రిమేక్ చేశారు.  అయితే తెలుగులో అర్జున్ రెడ్డికి ఉన్న క్రేజ్, యాంగ్రీ లుక్ తమిళ్ లో ధృవ్ చూపించలేకపోయాడని కామెంట్స్ వచ్చాయి.  ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్ట‌డంతో పాటు ధృవ్ కెరీర్‌కి చాలా మైన‌స్ అయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌తో ధృవ్ న‌ట‌న‌ని కంపేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ట్రోల్ చేశారు.

 

ఈ నేప‌థ్యంలో ధృవ్  చిత్రాల నుండి త‌ప్పుకొని బిజినెస్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు కోలీవుడ్ మీడియా రాసుకొస్తుంది.  అయితే తమిళ్ ఇండస్ట్రీలో విక్రమ్ కి ఇంకా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కోబ్రా లాంటి మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ఈ చిత్రం లో విక్రమ్ ఏడు పాత్రల్లో నటించబోతున్నాడట. అయితే కొంత కాలం తర్వాత తన తనయుడు ధృవ్ ని మళ్లీ ఇండస్ట్రీవైపు మళ్లీంచే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: