ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ వల్ల ఆర్థిక వ్యవస్థపై పడుతున్న విషయం తెలిసిందే.  గత కొంత కాలంగా చైనాలో ప్రబలిన వైర్ అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది.  భారత్ లో సైతం కరోనా భయంతో వణికి పోతున్నారు. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు ఇండస్గ్రీపై కూడా పడింది.  దాంతో చాలా చిత్రాల షూటింగ్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు. రిలీజ్, ఈవెంట్స్ క్యాన్సల్ చేసుకుంటున్నారు.  విదేశాల టూర్స్ నిలిపివేసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే ఈ నెల 27 నుంచి తమిళ నాట సినిమాలు ఉండబోవని... తమిళనాడులోని సినీ పంపిణీదారుల సంఘాల సమాఖ్య కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27వ తేదీ నుంచి కొత్త చిత్రాలను  విడుదల చేయరాదని నిర్ణయించినట్టు సంఘం అధ్యక్షుడు టి.రాజేందర్ తెలిపారు. అందరూ ఇదేదో కరోనా ఎఫెక్ట్ వల్ల అనుకుంటే తప్పులో కాలేసినట్లే.

 

ఇది అక్కడ వారి ప్రత్యేక సమస్య.  పంపిణీదారుల ఆదాయంలో పదిశాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని సంఘంలో తీర్మానం చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం అక్కడ  టికెట్లపై 12 శాతం జీఎస్టీ వసూలు చేయడమే కాకుండా స్థానిక సంస్థల కోసం 8 శాతం ఎల్బీటీ పన్నును కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులపై భారం పడుతోందని, ఈ కారణంగానే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా జరిగితే సినీ ఇండస్ట్రీకి భయంకరమైన ఎఫెక్ట్ పడుతుందని.. దానిపై ఆదారపడి ఉన్నవారు ఇబ్బందుల్లో పడతారని ఆయన అన్నారు.

 

ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు అస్త వ్యస్థంగా ఉందని.. ఒక చిత్రం తెరకెక్కించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న విషయం అని అన్నారు.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేయి చూడాలి. 27 నుంచి చిత్రాలు బంద్ అంటే మరి ప్రేక్షకుల పరిస్థితి ఏంటో చూాడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: