అపరిచితుడు సినిమా ద్వారా అశేషమైన ఖ్యాతిని పొందిన హీరో విక్రమ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అతని నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. మంచి కథాబలం ఉన్న సినిమాలు దొరకక పోవడమే అతని కెరీర్ కి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. శంకర్ దర్శకత్వం వహించిన ఐ:మనోహరుడు సినిమా కోసమని చాలా సన్నగా తయారైన విక్రమ్ డెడికేషన్ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే విక్రమ్ ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ... తన కొడుకు పై పూర్తి నమ్మకం ఉందని అంటున్నాడు ఆయన. అందుకే తన కుమారుడు ధ్రువ్ ని సినిమారంగంలోకి ప్రవేశపెట్టాడు.

 

 

ఐతే ధృవ్ మొట్ట మొదటిగా డేర్ అండ్ డాషింగ్ టాలీవుడ్ చిత్రమైన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' సినిమాలో హీరోగా నటించాడు. ధ్రువ్ వయసు కేవలం 24 సంవత్సరాలు కావడంతో... మొదటి సినిమాలో ఎంత బాగా నటించాలో విక్రమ్ చాలా హెల్ప్ చేశాడట. నిజమేమిటంటే చదువుకుంటున్న తనని విదేశాల నుండి ఉన్నఫలంగా స్వదేశానికి రప్పించి సినిమాలలో హీరోగా నటించాలని చెప్పాడట. దీంతో తండ్రి ఏది చెప్తే అదే కరెక్ట్ అని ఎప్పుడూ భావించే ధృవ్ వెంటనే సినిమాలో హీరోగా చేసేందుకు ఒప్పుకున్నాడట. అయితే ఆదిత్య వర్మ షూటింగ్ పూర్తయిన తర్వాత ధృవ్ మళ్ళీ ఫారిన్ కి వెళ్లి తన చదువుని పునఃప్రారంభం చేస్తాడని అనేక వార్తలు తమిళ మీడియా లో దర్శనమిచ్చాయి.

 

 

అయితే ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ధృవ్ తన రెండవ సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. ప్రముఖ దర్శకుడు సెల్వ రాజు దర్శకత్వంలో తన రెండవ సినిమా తెరకెక్కబోతున్నట్టు  తెలిసింది. ప్రస్తుతం సెల్వ రాజు హీరో ధనుష్ తో ఒక సినిమా ని తీస్తున్నాడు. అది పూర్తయిన వెంటనే ధృవ్ తో మరొక సినిమాని తీసేందుకు సెల్వరాజ్ సిద్దమవుతాడు. సో, ధృవ్ సినిమాలకు వీడ్కోలు చెప్పి విదేశాలకు వెళ్ళి తన చదివుని పునప్రారంభం చేయబోతున్నాడన్న వార్తలు ఒట్టి అబద్దం.

మరింత సమాచారం తెలుసుకోండి: