గత రెండు మూడేళ్ళ నుంచి నందమూరి అభిమానులు బాలకృష్ణ నట వారసుడి రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయంలో అందరివీ ఊహలే అవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టే విషయంలో నందమూరి కుటుంబం నుంచి ఒక్క మాట కూడా బయటకు రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నందమూరి మోక్షజ్ఞ ఫోటోలు బాలకృష్ణ అభిమానుల్లో వారసుడి ఎంట్రీ పట్ల పలు రకాల అనుమానాల కు దారితీశాయి.

 

 కారణం ఆ ఫోటోల్లో మోక్షజ్ఞ చాలా లావుగా కనిపించారు. హీరోకి కావల్సింది ప్రేక్షకులలో ఆకర్షణ. అలాంటిది ఎటు వంటి ఆకర్షణ లేకుండా చాలా లావుగా కనిపించిన మోక్షజ్ఞ ను చూసిన నందమూరి అభిమానులు ఒకింత నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే పెద్ద హీరోలందరి నట వారసులు చిత్ర పరిశ్రమ లోకి అడుగుపెట్టి తమ ప్రతిభను నిరూపించుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలయ్య అభిమానులు కూడా వారసుడి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. 

 

ఇప్పుడు అసలు మోక్షజ్ఞ హీరోగా సినీరంగ ప్రవేశం చేయడం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నందమూరి అభిమానుల ఆశలకు ఎటువంటి సమాధానం లభిస్తుందో ఇక ముందు చూడాలి. బాలకృష్ణ తన వారసుడి ఎంట్రీ కోసం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు ఎవరు అనే దాని మీద ఆయన ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఏ విధంగా తన వారసుడ్ని పరిచయం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు బాలయ్య. అయితే అతను సినిమాలు చేయడం లేదని అతనికి ఆసక్తి లేదని వ్యాపారాలు చూసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనితో బాలకృష్ణ తన కొడుకు విషయంలో అంత ఆసక్తి చూపించడం లేదని సినీ వర్గాల్లో ప్రధానంగా చర్చలు జరుగుతున్నాయి. మరి బాలయ్య ఎం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: