అల్లు అర్జున్ మొదట డాన్సర్ గా డాడీ సినిమాలో కనిపించాడు. అయితే చిన్ననాటి నుండి బన్నీకి డాన్స్ అంటే ఇష్టం అని చెప్పేవాడు. మొదట తన తల్లి ఆలోచించింది. ఇలా బన్నీ ఉండడం మంచిదా కాదా అని కానీ తర్వాత ఆమె ఒప్పుకుంది. ఇలా అల్లు అర్జున్ ఇంకా బాగా నేర్చుకున్నాడు వాళ్ళ ప్రోత్సాహం వల్ల బన్నీజిమ్నాస్టిక్స్ కూడా నేర్చుకున్నాడట. పియానో కూడా వాయించడం నేర్చుకున్నాడట. అల్లు అర్జున్ ఎంతో కష్టపడి చదివేవాడట. కానీ ఎంత కష్టపడినా మార్కులు వచ్చేవి కాదు, చదివినవి గుర్తు ఉండడం కూడ ఉండేది కాదట.

 

 

బాల్యంలో బన్నీ బాల నటుడిగా నటించాడు. స్వాతి ముత్యం సినిమాలో బాల నటుడిగా నటించాడు. అలానే విజేత సినిమాలో కూడ బాల నటుడిగా బన్నీ నటించాడు. ఆ తర్వాత తను డాడీ సినిమాలో డాన్సర్ పాత్రలో నటించాడు. డాన్స్ అంటే ఇష్టం వల్ల ఆ పాత్రలో 100% పర్ఫార్మెన్స్ అందించాడు అల్లు అర్జున్. ఇలా ఈ సినిమాతో ప్రజలకి దగ్గరయ్యాడు ఈ హీరో. గోపి పాత్రలో జీవించి డాడీ తర్వాత హీరోగా తెరపై కనిపించాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా నటించాడు ఈ స్టైలిష్ స్టార్.

 

 


గంగోత్రి, ఆర్య, బన్ని, హ్యాపి, దేశముదురు, శంకర్ దాదా జిందాబాద్, పరుగు, ఆర్య2, వరుడు, వేదం, బద్రీనాధ్, జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం, ఎవడు, సన్నఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు, దువ్వాడ జగన్నాదం, నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా), అల వైకుంఠపురంలో... ఇలా అనేక సినిమాల్లో నటించాడు ఈ హీరో. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటుడు ఇతను. తనకి ఇష్టమైన డాన్స్ పాత్ర నచ్చి వచ్చాడు చిరంజీవి సినిమాలో ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఇస్తూ అఖండ ప్రజా అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

మరింత సమాచారం తెలుసుకోండి: