ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా బాగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ, ఆర్ ఎక్స్ 100 తో కార్తికేయ లాంటి హీరోలు ఫామ్ లో కొనసాగుతున్నారు.  ఈ నేపథ్యంలో ఇది ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో హీరోగా తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు విశ్వక్ సేన్.  హైదరాబాదీ కుర్రాళ్ల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో కొన్ని బూతు డైలాగ్స్ ఉన్నాయి.  అయితే ఈ చిత్రంతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా విశ్వక్ సేన్ అతని చిత్రం పై విమర్శల వర్షం  కురిపించారు. ఈ మద్య నాని నిర్మించిన ‘హిట్ ’ చిత్రంలో నటించాడు. క్రైమ్, థ్రల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించాడు విశ్వక్ సేన్. నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తున్నాడు. 

 

‘హిట్' చిత్రం, నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. గతంలో ఫలక్ నామా దాస్ కి ఓపెనింగ్స్ వచ్చినప్పుడు అది ట్రైలర్ ఎఫెక్ట్ అనుకున్నారు. కానీ, విజయ్ దేవరకొండ శైలిని అనుకరించే విశ్వక్ కి యూత్ లో ఓ వర్గం సపోర్ట్ దక్కుతుంది.  మనోడు మీడియాలో కూడా తనపై విమర్శలు చేసిన వారిపై చిందులు వేశాడు.. దాంతో కొన్ని వర్గాల నుంచి ఈ  యంగ్ హీరోపై విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో నిలబడాలని.. తనకు ఎవరితోనూ బేదాభిప్రాయాలు లేవని.. అందరూ తనకు మంచి స్నేహితులని అన్నారు. 

 

ఇక హిట్ విజయం తర్వాత   'దిల్' రాజు బ్యానర్లో చేయనుండటం విశేషం. నరేశ్ కొప్పల్లి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఒకటీ రెండు చిత్రాలతోనే దిల్ రాజు దృష్టి ఆకర్షించాడు విశ్వక్ సేన్. ఈ చిత్నానికి సహనిర్మాతగా బెక్కం వేణుగోపాల్ వ్యవహరించనున్నాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.  ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ తన రెమ్యూనరేషన్ కోటి వరకు పెంచుతున్నట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: