"అనుష్క" పేరు తెలియని వారు ఎవరు ఉండరు.కొత్త హీరోయిన్స్ ఎంత మంది వచ్చిన జేజమ్మ స్థానం జేజమ్మదే.. అనుష్క తెలుగు ఇండస్ట్రీ గౌరవించదగ్గ  గొప్ప నటి.. మొదట  'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనది  అనుష్క.. సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. సూపర్‌ మూవీతో సినిమా కెరీర్‌ను మొదలుపెట్టి..

 

ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, బాహుబలి, భాగమతి సినిమాలతో సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ పేరు చెప్పగానే అందమైన మనసున్న ఓ అద్భుత అందాల రాశి మన కళ్ల ముందు మెదులుతుంది. చక్కని రూపం, మంచి ఎత్తు, పెర్సనాలిటీ, గ్లామర్, ఒక్కటి ఏంటి అన్ని కలబోసిన కొండపల్లి బొమ్మ. ఆమె నటన గురించి చెప్పగానే ఓ అరుంధతి, ఓ దేవసేన,  మరో భాగమతి పాత్రలు గుర్తొస్తాయి.లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి పెట్టింది పేరు అనుష్క. హీరో లేకపోయినా ఒంటి చేత్తో సినిమాని  ముందుకు నడిపిస్తుంది.

 

ఇవే కాదు.. ఆమె అద్భుతమైన నటనకు తార్కాణంగా తెరకెక్కిన పాత్రలు ఎన్నో.. అలాంటి ముద్దుల స్వీటీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టి 15 సంవత్సరాలు అయిందంటే నమ్మలేము.. అసలు అనుష్క సినీ ప్రస్థానం ఎలా మొదలు అయిందంటే...అసలు అనుష్క యోగ టీచర్.  మన దేశంలోనే ప్రముఖ యోగా గురువుగా పేరున్న భరత్ ఠాకూర్ వద్ద యోగా శిక్షకురాలిగా కొంత కాలం పనిచేసింది స్వీటీ.. అలా యోగా ట్రైనర్ గా ఉంటూ బెంగళూరులో నివసిస్తున్న సమయంలో ఈమె ఫోటోలు దర్శకుడు పూరి జగన్నాధ్ కంటపడ్డాయి. అయితే పూరి వెంటనే ఆమె ఎవరు అని తెలుసుకుని హైదరాబాద్ కి పిలిపించడం జరిగింది.

 

అలా ఆమె మొదటి సారి కెమెరా ముందు నిలబడింది. మొదటి ఫోటో షూట్ లో కెమెరా ముందు నిలబడి వారు చెప్పింది చేస్తున్న సమయంలో తన అమాయకత్వానికి అక్కడున్నవారంతా కూడా నవ్వడం తనకి ఇప్పటికి కూడా గుర్తే అని ఒక ఇంటర్వ్యూ లో  చెప్పింది. ఆ స్క్రీన్ టెస్ట్ లో పాసవ్వడంతో అక్కినేని నాగార్జున పక్కన సూపర్ చిత్రంలో అవకాశం లభించింది.

 

ఆ సినిమాతో ఒక గ్లామర్ హీరోయిన్  తెలుగు తెరకు పరిచయమైంది.తర్వాత ఇంకా వెనక్కి కూడా తిరిగి చూడలేదు.  ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాలో నటిస్తోంది. హే దర్శకత్వంలో  సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: