ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు ప్రజలకు చుక్కలు చూపిస్తుంది. ఊహించని విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం తో ప్రజలు అందరూ భయపడిపోతున్నారు. ఇక ఈ ప్రభావం సినిమాల మీద కూడా ఎక్కువగానే పడింది. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని భాషల్లో సినిమాలను వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమా షూటింగ్స్ ని విదేశాల్లో చేసే విధంగా ప్లాన్ చేసినా సరే ఆపేస్తున్నారు. చేసేది ఏమీ లేక నిర్మాతలు చేతులు ఎత్తేస్తున్నారు. ఇక ఈ వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. 

 

తమిళంలో కూడా స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఆ సినిమాలను విడుదల చేయకుండా ఆపేస్తున్నారు. జనాలు ఇప్పుడు థియేటర్ కి వచ్చే పరిస్థితి కూడా దాదాపుగా లేదు అనే చెప్పాలి. దీనితో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నారు. ఇక మన తెలుగులో అయితే ఇప్పుడు కొందరు అగ్ర నిర్మాతలు భయపడుతున్నారు. సినిమాల కోసం తీసుకున్న అప్పుల వడ్డీలు భారీగా పెరిగిపోవడం ఎం చెయ్యాలి అనేది చాలా మంది నిర్మాతలకు అర్ధం కావడం లేదు. మరి కొందరు నిర్మాతలు దర్శకులను బ్రతిమిలాడే పరిస్థితి ఏర్పడింది. 

 

షూటింగ్ ఇక్కడే పూర్తి చెయ్యాలని కోరుతున్నారట. వడ్డీలు పెరుగుతున్నాయి కాబట్టి ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆరు అగ్ర హీరోల సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. ఆ సినిమాలు అన్నీ వాయిదా వేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక్క ట్రిపుల్ ఆర్ మినహా ఇతర హీరోల సినిమాలు అన్నీ విదేశాల్లో షూట్ చేసేవే ఉన్నాయి. మరి వాటిపై దర్శకులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు భారీ పెట్టుబడులు పెట్టే నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: