తెలుగు సినిమాల్లో విలనిజం భారీగా ఉంటుంది. హీరోతో సమానంగా విలనిజం ఉంటే ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారు. అటువంటి విలనిజం ప్రదర్శించిన ఎందరో నటులు మనకు ఉన్నారు. కథకు తగ్గట్టే రచయితలు, దర్శకులు సినిమాల్లో విలనిజాన్ని పక్కాగా తీర్చిదిద్దేవారు. అయితే అప్పుడప్పుడూ కొత్తగా ట్రై చేస్తూ బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకోవడం తొంభైల కాలం నుంచీ ఉంది. అలా తెలుగు సినిమాల్లోకి విలన్ గా బాలీవుడ్ నుంచి అమ్రిష్ పురిని తీసుకొచ్చారు. భయంకరమైన రూపం, వాయిస్ లో గాంభీర్యం, నిలువెత్తు శరీర ధారుడ్యంతో చూడగానే జడుసుకునే తీరు అమ్రిష్ పురిది.

IHG

 

అమ్రిష్ పురి దేహధారుడ్యం కొన్ని పాత్రలకు సరిగ్గా సరిపోయేది. నాగార్జున-శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరిపోరాటంలో అమ్రిష్ పురి విలన్ గా చేసి ఆడియన్స్ ను మెప్పించారు. తర్వాత చిరంజీవి – అమ్రిష్ పురి కాంబినేషన్లో కొండవీటిదొంగ, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ చేసిన రెండు సినిమాలతో ప్రేక్షకుల్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. 1990లోనే వరుసగా వచ్చిన ఈ రెండు సినిమాల్లో వీరిద్దరూ తలపడ్డారు. కొండవీటిదొంగలో భీకరమైన క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యారు. జగదేకవీరుడు అతిలోక సుందరిలో నున్నటి గుండుపై ఎర్రటి చారతో తాంత్రికుడిగా ఇంటర్వెల్ ఎపిసోడ్, క్షుద్రపూజలు చేసే సీన్లలో ప్రేక్షకులను భయపెడుతూ అమ్రిష్ పురి జీవించారనే చెప్పాలి.

IHG

 

బాలకృష్ణతో ఆదిత్య 369, అశ్వమేధం అనే రెండు సినిమాల్లో భయంకరమైన విలనిజాన్ని ప్రదర్శించారు అమ్రిష్ పురి. ఈ సినిమాల్లో కూడా క్రూరత్వం ప్రదర్శించే నటనలో విభిన్నమైన నటన చూపించారు. చేసిన ప్రతి సినిమాలో విభిన్నమైన గెటప్స్ లో కనిపించారు. సీనియర్ ఎన్టీఆర్మోహన్ బాబు మూవీ మేజర్ చంద్రకాంత్ లో కూడా అమ్రిష్ పురి తనదైన విలనిజాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: