రాజమౌళి నాస్థికుడు ఆయన కృషిని తప్ప దేవుడుని నమ్మడు. అయితే అతడు తీసిన చరిత్ర సృష్టించిన ‘బాహుబలి’ లో భారీ శివలింగాన్ని ప్రభాస్ భుజం పై పెట్టి ఒక అద్భుతమైన ఎమోషనల్ సీన్ తీసాడు. దీనితో పైకి అనకపోయినా రాజమౌళికి దేవుడు అంటే ముఖ్యంగా శివుడు అంటే బాగా నమ్మకం అన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకే అతడి ఇంటి పేరు కోడూరి రాజమౌళి అయినా శ్రీశైలం శివ రాజమౌళి అన్నపదాన్ని గుర్తుకు చేసే విధంగా ఎస్ ఎస్ రాజమౌళిగా పేరు మార్చుకున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళికి తెలియకుండానే జూలై నెల జక్కన్నకు బాగా కలిసి వచ్చింది. రాజమౌళి స్థాయిని పెంచిన ‘ఈగ’ మూవీ జూలైలో విడుదల అయితే ఇండస్ట్రీ చరిత్రను సృష్టించిన ‘బాహుబలి’ బిగినింగ్ కూడ జూలై లోనే విడుదలైంది. దీనితో అదే సెంటిమెంట్ ను రిపీట్ చేయాలని రాజమౌళి జూలై లోనే తన ‘ఆర్ ఆర్ ఆర్’ ను విడుదల చేయాలని చాల గట్టి ప్రయత్నాలు చేసాడు. 


అయితే పరిస్థితులు అనుకూలించక పోవడంతో ఆ మూవీ వచ్చే ఏడాది జనవరికి వాయిదా పడటంతో జక్కన్నకు కలిసి వచ్చే జూలై నెల పై ఇప్పుడు మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ కన్ను పడింది. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మూవీని జూలైలో విడుదల చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఈ సినిమాకు సంబంధించి బాక్సర్ ఫైటర్ అనే టైటిల్స్ ఇప్పటికే పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీలోని తన బాక్సర్ పాత్ర కోసం విదేశాలకు వెళ్ళి బాక్సింగ్ లో కూడ శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ మూవీని వేగంగా పూర్తి చేసి జూలై లో విడుదల చేయాలని వరుణ్ తేజ్ స్థిర నిర్ణయం తీసుకోవడంతో రాజమౌళి లక్ ను వరుణ్ తేజ్ కబ్జా చేస్తున్నాడా అంటూ జోక్స్ పడుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: