సినిమాలంటే రుచి ఉండాలంటున్నారు.. అందుకే సినిమా కు విలన్ బ్యాక్ బోన్ అని అంటున్నారు. సినిమాలలో జనాలు మెచ్చేది నచ్చేది ఒకటే హీరో విలన్ ను ఎంత బాగా కొట్టాడు.. ఆ ఆతర్వాత హీరోయిన్ ను గెలుచుకున్నాడు లేదా. ఇలాంటి ఆసక్తికర అంశాలు సినీ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. అందుకే పాజిటివ్ టాక్ తో విలన్లు రాణిస్తున్నారు. 

 

 

 


ఇకపోతే తెలుగు సినిమాల్లో విలన్ల సన్నివేశాలు కూడా గమ్మత్తుగా ఉంటాయి. ఎన్నో తెలివి తేటలు, తెగింపుతో ఉండే విలన్ డాన్ గా గొప్ప స్థాయిలో ఉన్నా ఒక్కోసారి హీరో వేసిన ట్రాప్ లో పడతాడు. తప్పదు కథ నడవాలంటే అలానే చేయాలని సమర్ధించవచ్చు. విలన్ ఎంత బలవంతుడైన సరే హీరో అతని పని పట్టాల్సిందే. కానీ కొన్ని సినిమాల్లో విలన్ ను చాలా స్ట్రాంగ్ గా చూపించి సాధారణ వ్యక్తి అయినా హీరో అతని ఢీ కొట్టడం అతనిపై విజయం సాధించడం చూపిస్తారు.

 

 

 

తెలుగు సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే.. సినిమాలో హీరో గెలవాలి.. విలన్ ఓడి పోవాలి.. కథ ప్రకారంగా ఇదే ఫార్మేట్ నడుస్తుంది. కానీ సినిమాలో విలన్ ను అతి బలవంతుడిగా చూపించి హీరోతో అతన్ని ఢీ కొట్టే విధానం ఒక్కోసారి సిల్లీగా అనిపిస్తుంది. కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో ఇదంతా కామనే అని సర్ది చెప్పుకున్నా మరీ ఇల్లాజికల్ అనిపించినప్పుడే తేడా కొడుతోంది..అయితే హీరోని దెబ్బ కొట్టిన పాత్రలో విలన్ అలరిస్తాడు. 
 

 

 

అయితే కొన్ని సార్లు మాత్రం విలన్ పాత్రని చూపించిన తీరు మాత్రం అదరహో అనిపిస్తుంది.  తెలుగు సినిమాల్లో విలనిజంలో వచ్చిన ఈ మార్పుని ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విలన్ అంటే డాన్ అనే కొన్నాళ్ల తెలుగు సినిమా సెంటిమెంట్ కు బ్రేక్ వేస్తూ కొత్త కథలతో కొత్త విలనిజంలో వస్తున్నారు..వారందరు మంచి స్థాయిలోకి రావాలని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: