ప్రస్తుతం చైనా దేశంతో పాటు ప్రపంచ దేశాలని కరోనా వైరస్ గజగజలాడిస్తుంది. నిజానికి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ చాలా రంగాలపై చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తోంది.  ప్రపంచంలో ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ఇప్పడికే చనిపోయారు. ఇంక దీని భారిన పడిన వారి చెప్పక్కరలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సంఖ్య లక్షని దాటేసింది. ఇది కేవలం కరోనా వైరస్ చైనా దేశాన్నే కాదు..  మన దేశాలతో పాటు ప్రపంచ దేశాలనన్నిటిని సైతం వణికిస్తోంది. 

 


కరోనా వైరస్ దెబ్బతో లక్షలకు లక్షల కోట్లు ఆవిరిపోతున్నాయి. ఈ నెల మొదటి వరం నుంచి మన దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జనాల్లో ఒక రకమైన అభద్రత భావం వచ్చింది. దీనితో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఆఖరి వరకు జన సమ్మర్థం ఎక్కువగా ఉండే స్కూల్స్, కాలేజ్స్, థియేటర్స్, పబ్స్ ఇలా అన్నిటిని  బంద్ చేయాలని జీవో పాస్ చేసిన సంగతి మనకి తెలిసిందే. 

 

 


దేశంలో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ధిల్లీ రాష్ట్రాలు అదే బాటలో పయనించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కరోనాపై రాజమౌళి ఒక ట్వీట్ చేసాడు. కరోనా కారణంగా ప్రపంచమే స్థంభించడం చూస్తుంటే షాకింగ్‌ గా ఉందని అందులో ఆయన పేరుకొన్నారు. ఇప్పుడు ఇలాంటి సమయాలలో ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంకా వైరస్ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు చేయాలో అది చేస్తే బాగుంటుందన్నారు. 

 

 


ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న #RRR పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. నిజానికి ఈ సినిమాలో అనేక మంది విదేశీ నటులు నటిస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశీయులకు సంబంధించిన వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు #RRR సినిమాపై దాని ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: