వెండి తెర మీద మోస్ట్ సక్సెస్‌ ఫుల్ ఫార్ములా లవ్‌ స్టోరీస్‌. అందుకే లవర్ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న హీరోలకు ఉన్న డిమాండే వేరు.  ఏ జానర్‌ సినిమాలు ఆకట్టుకున్నా.. ఆకట్టుకోకపోయినా లవ్‌ స్టోరీస్‌ మాత్రం ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అయితే వెండితెర మీద ప్రేమను అద్భుతంగా పండించిన తెలుగు హీరోలు నిజ జీవితంలో మాత్రం లవ్ ఫెయిల్యూర్సే కావటం విశేషం.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో శోభన్ బాబు. రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్‌ను తొలి సారిగా వెండితెర మీద చూపించిన శోభన్‌ బాబు నిజ జీవితంలో మాత్రం తన లవ్‌ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాడు. హీరోగా శోభన్‌ బాబు మంచి ఫాంలో ఉండగా అప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న జయలలితతో ప్రేమలో పడ్డాడు. అప్పట్లోల వీరిద్దరి మధ్య ప్రేమ గురించి రకరకాల వార్తలు మీడియాలో వినిపించాయి. అయితే పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన శోభన్ బాబు, జయ లలిత పెళ్లి బంధంతో ఒక్కటి కాలేకపోయారు.

 

ఈ జనరేషన్‌ హీరోల ప్రేమ కథలు కూడా ఇలా విషాందాంతాలుగానే మిగిలాయి. ఈ జనరేషన్‌ ఉవ్వెత్తున ఎగిసి పడిన లవర్‌ బాయ్ ఉదయ్‌ కిరణ్‌. ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ లవర్‌ బాయ్‌గా తిరుగు లేని స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. హీరోగా ఫాంలో ఉండగానే మెగాస్టార్ చిరంజీవి కూతురితో ప్రేమలో పడ్డాడు ఉదయ్‌ కిరణ్‌. అయితే ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిన తరువాత అనుకోని పరిస్థితుల్లో వీరి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

 

లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన మరో లవర్ బాయ్‌ తరుణ్‌, బాల నటుడిగానే ఇండస్ట్రీకి సుపరిచితుడైన తరుణ్ తొలి సినిమా నువ్వే కావాలి తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. లవర్‌ బాయ్ గా ఎదుగుతాడనుకుంటున్న తరుణంలోనే అప్పటి స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్‌ తో ప్రేమాయణం నడిపించాడు. కానీ వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: