ఈ జనరేషన్‌ లో హీరోలు వెండితెర మీదకు పరిచయం అయ్యేందుకు ఎక్కువగా లవ్ స్టోరీస్‌ నే ఎంచుకుంటున్నారు. ప్రేమ కథలు సక్సెస్ ఫార్ములా కావటంతో హీరోలు ఈ జానర్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే ఒకసారి హీరోగా పరిచయం అయిన తరువాత మాస్ ఇమేజ్‌ కోసం ఎదురుచూస్తున్నారు లవర్‌ బాయ్స్‌. ఈ ప్రయత్నంలో పూర్తిగా కెరీర్ పాడు చేసుకున్న హీరోలు కూడా ఉన్నారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో ఉదయ్‌ కిరణ్‌. చిత్రం, నువ్వు నేను లాంటి సినిమాలో హీరోగా మంచి ఇమేజ్‌ సొంతం చేసుకున్న ఉదయ్‌ కిరణ్ తరువాత మాస్‌ ఇమేజ్‌ కోసం ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో పూర్తిగా తన కెరీర్‌ ను పాడు చేసుకున్నాడు ఉదయ్‌ కిరణ్‌. లవర్‌ బాయ్‌గా ఫుల్‌ ఫాంలో ఉండగానే శ్రీరామ్‌ లాంటి కమర్షియల్ సినిమా చేశాడు ఉదయ్‌ కిరణ్‌. ఈ సినిమాతో యాక్షన్‌ హీరోగా ప్రూవ్ చూసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా ఫెయిల్ కావటంతో ఉదయ్‌ కిరణ్‌ కెరీర్‌ కూడా కష్టాల్లో పడింది.

 

లవర్‌ బాయ్‌ గా మంచి ఇమేజ్‌ ఉన్న అక్కినేని హీరో కూడా మాస్‌ ఇమేజ్‌ కోసం చేసిన ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యాడు. రొమాంటిక్‌ హీరోగా మంచి ఫాంలో ఉన్న సమయంలో దడ, ఆటో నగర్ సూర్య లాంటి సినిమాలతో దారుణమైన ఫెయిల్యూర్స్‌ ను ఎదుర్కొన్నాడు. దీంతో ఇక మాస్ సినిమాలు తనకు సరిపడవని లవ్‌ స్టోరిలతో సరిపెట్టుకుంటున్నాడు చైతూ.

 

గతంలో లవర్‌ బాయ్‌గా మంచి ఇమేజ్‌ సొంతం చేసుకున్న తరుణ్ కూడా మాస్ ఇమేజ్‌ తాపత్రేయ పడ్డాడు. అద్భుతం లాంటి కమర్షియల్ సినిమాలు చేసినా అవి తరుణ్ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఇలా చాలా మంది హీరోలు లవర్ బాయ్‌ ఇమేజ్‌ నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: