కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచమంతా స్థంభించింది. దాదాపు 150 దేశాలను అల్లడిస్తున్న ఈ మహమ్మారి దెబ్బకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. దాదాపు ప్రజలంతా ఇంటికే పరిమతమవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలు మూసివేయటంతో జిమ్‌ సెంటర్లు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఇంట్లోనే వర్క్‌ అవుట్‌ ఎలా చేయలో ఓ వీడియోలో వివరించింది.

 

తన ట్రైనర్‌ తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో వర్క్‌ అవుట్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కత్రినా స్క్వాట్స్‌, ఫుష్‌ అప్స్‌, సిట్‌ అప్స్‌, లాంటివి చేస్తూ వీడియోను పబ్లిష్‌ చేసింది. తన ఇంటి మీద షూట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు వర్క్‌ అవుట్ ఎట్‌ హోం (ఇంటి వద్దే వ్యాయామం) జిమ్‌కు వెళ్లలేకపోతున్నాం అందుకే నేను యస్‌ మా ఇంట్లో చేసిన వర్క్‌ అవుట్ వీడియోనే షేర్ చేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి. యాక్టివ్‌గా ఉండండి అంటూ ట్వీట్ చేసింది.

 

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల రిలీజ్‌ అయిన అంగ్రేజీ మీడియం లో గెస్ట్ అపియరెన్స్‌ ఇచ్చిన కత్రినా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న సూర్యవంశీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అక్షయ్‌ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు రోహిత్ శెట్టి దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: