ఒక్కోసారి సెలబ్రిటీల అత్యుత్సాహం వారికి లేని పోని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. సందర్భానుసారంగా స్పందించకపోతే ఎవరికైన ఇలాంటి తిప్పలు తప్పవు. తాజాగా నటి దివ్యాంక త్రిపాటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కరోనా కారణంగా దేశమంత దాదాపు కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకు రావడానికే భయపడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలను అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని కోరుతోంది. ఈ నేపథ్యంలో దివ్యాంక చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదంగా మారింది.

 

ఖాళీగా ఉన్న రోడ్ల వీడియోను తన ట్విటర్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన దివ్యాంక, ప్రస్తుతం మెట్రో, రోడ్ పని కార్మికులు తమ పనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకోవచ్చు. అంటూ కామెంట్ చేసింది, అయితే ఈ ట్వీట్‌పై నెటిజెన్లు మండిపుతున్నారు. ప్రపంచ మంతా భయాందోళనలో ఉన్న సమయంలో ఇలా పనులు సులువుగా చేసుకోవచ్చు అంటూ ట్వీట్ చేయటం ఏంటి అంటూ ఆమెకు రిప్లై ఇస్తున్నారు.

 

ఆమె ట్వీట్ దారుణం అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో దివ్యాంక ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది.  కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. `లేబర్‌ వర్కర్స్‌ కూడా మనుషులే.. ఇది ఆపత్‌ సమయం, ఆరోగ్య విషయంలో అందరికీ రక్షణ అవసరం` అంటూ కొందరు రిప్లై ఇవ్వగా.. చాలా మంది నీ ట్వీట్‌ డిలీట్‌ చేయ్‌ అంటూ దివ్యాంకపై ఫైర్ అవుతున్నారు. మరో నెటిజెన్‌ ఇంజనీర్లు, కన్స్‌స్ట్రక్షన్‌ వర్కర్‌ల జీవితం కూడా ఇంపార్టెంట్‌... ప్రస్తుంత ఉన్న సమయంలో మీరు చేసిన ట్వీట్ అనవసరం అంటూ ఓ నెటిజెన్‌ బుద్ధి చెప్పారు.

 

అయితే నెటిజెన్ల ఆగ్రహంతో దిగి వచ్చిన దివ్యాంక.. ` మనమంతా మనుషలం పొరపాట్లు చేస్తుంటాం. ఓ విషయం అత్యంత వేగం విస్తరించే ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అందరికీ ఓ ప్రశ్న.. ఓ వ్యక్తికి తన తప్పును అంగీకరించి, క్షమాపణ కోరే శక్తి ఉంటే.. మీకు  ఆ వ్యక్తిని క్షమించే శక్తి ఉందా అంటూ ఆమె ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: