ఆయన తెలుగు సినిమా చరిత్రలో మొదటి ఇద్దరిలో ఒక్కరు. ఎన్నో సినిమాల్లో మరుపు రాని పాత్రలలో నటించారు. ప్రేమకథ చిత్రమైన, పౌరాణికంలోను ఇట్టే ఒదిగిపోయి నటించగలరు. మొదట సినిమాలో డాన్స్ ని కనిపెటింది అయన. మద్రాస్ లో మగ్గిపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమ ను హైదరాబాద్ కు తరలించడం లో తన వంతు కృషి చేశారు అక్కినేని. తన తుది శ్వాస విడిచే వరకు నటనే ఊపిరిగా బతికిన మహోన్నత వ్యక్తి. ప్రేమ కథ చిత్రాలైన, పౌరాణిక నాటకాలైన.. ఏ పాత్రలో నైనా ఆయన ఒదిగిపోయే వాడు.

 

ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేనిని చూసాడు. ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసాడు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీజీవితానికి తెరలేచింది. అప్పటినుండి రకరకాల తెలుగు, తమి‌ళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించాడు. 

 

అప్పట్లో దేవదాస్, ప్రేమ్ నగర్ వంటి ప్రేమ చిత్రాల్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టారు. మేఘ సందేశము, దసరా బుల్లోడు, మూగ మనసులు, మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి ఎవర్ గ్రీన్ చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. సినిమాల్లో డాన్సులు తీసుకొచ్చింది అక్కినేని నాగేశ్వర్రావు.

 

 తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. చిత్ర పరిశ్రమని హైదరాబాదుకు రావడానికి ఎంతో కృషి చేశాడు. పర భాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరు చేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. తన వారసులను పరిశ్రమకు అందించాడు.

 

ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేని నాగేశ్వరరావు ను విజయవాడ రైల్వేస్టేషన్ లో చూసి ఉండక పోతే తెలుగు సినీ పరిశ్రమకు ఓ దిగ్గజం ఉండే వాడు కాదు. నటన మీద మక్కువ, అనేక సినిమాలతో ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు. నటకిర్తిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: