80లలో ఇండస్ట్రీని ఏలిన స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణ రావు. తెలుగు సినిమాకు కమర్షియల్ స్టామినా ఏంటో చూపించిన దర్శకుడు దాసరి. సందేశంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుంగా సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దాసరి ఎన్టీఆర్ నుంచి యంగ్ జనరేషన్ వరకు అందరితోనూ సినిమాలు చేశాడు. అయితే ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం కేవలం ఒకే ఒక్క సినిమా చేశాడు. అప్పట్లో సూపర్ ఫాంలో ఉండి సంవత్సరానికి ఏడెనిమిది సినిమాలు చేస్తున్న చిరు దాసరితో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేశాడు.
హీరోగా కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో లంకేశ్వరుడు అనే సినిమా చేశాడు. వడ్డే రమేష్ నిర్మించిన ఈ సినిమాలో చిరుకు జోడిగా రాధ నటించకగా రేవతి మరో కీలక పాత్రలో నటించింది. 1989లో రిలీజ్ అయిన ఈ సినిమాకు దారుణమైన రిజల్ట్ వచ్చింది. అప్పటి వరకు వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న చిరు స్పీడుకు ఈ సినిమా బ్రేకులు వేసింది. దాసరి కూడా అప్పటి వరకు వరుసగా విజయాలు సాదిస్తూ మంచి ఫాంలో ఉండగా ఈ సినిమా దాసరి విజయ యాత్ర కూడా కూడా బ్రేక్ వేసింది.
దీంతో చిరంజీవి అభిమానులు కూడా హర్ట్ అయ్యారు. అందరు హీరోలకు సూపర్ హిట్ లు ఇచ్చిన దాసరి తన అభిమాన నటుడికి మాత్రం డిజాస్టర్ ఇవ్వటంపై ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ సినిమా రిజల్ట్ దాసరి, చిరు ల మధ్య కూడా దూరాన్ని పెంచింది. అందుకే ఈ ఒక్క సినిమాతోనే ఈ క్రేజీ కాంబినేషన్ లో ఆగిపోయింది. ఆ తరువాత చిరంజీవి, దాసరి దర్శకత్వంలో మరో సినిమా చేయలేదు. అయితే ఈ సినిమా చాలా కాలం తరువాత హిట్లర్ సినిమాలో దాసరి తో కలిసి నటించాడు చిరు.