ప్రస్తుతం ప్రపంచాని భయపెడుతున్న ప్రధాన సమస్య కరోనా వైరస్‌. ఈ వైరస్‌ ప్రభావంతో ఇప్పటికే దాదాపు 10 వేల మంది మరణించగా రెండున్నర లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. భారత్‌ లోనూ కరోనా బాధితుల సంఖ్య 200 లకు దగ్గర అవుతుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. చేతులు శుభ్రగా కడుక్కోవటం, వ్యక్తిగత శుభ్రత లాంటి అంశాల మీద అవగాహన కల్పిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఇటీవల అమితాబ్ ముంబైలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ముంబై ఎయిర్ పోర్ట్‌ లో విదేశాల  నుంచి వచ్చిన వారికి ఓం ఐసోలేషన్‌ లో ఉండాలని కొంత మంది చేతి మీద స్టాంపులను వేస్తున్నారు. ఆ స్టాంప్‌కు సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌ లో పోస్ట్ చేసిన అమితాబ్‌ `ముంబై ఎయిర్ పోర్ట్‌లో చేతుల మీద ఓటర్‌ ఇంక్‌తో స్టాంప్‌లు వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తంగా ఉండండి. కరోనా సోకినట్టుగా అనుమానం ఉంటే అందరికీ దూరంగా ఉండండి` అంటూ ట్వీట్ చేశాడు.

 

అయితే అమితాబ్‌ సోషల్ మీడియా పేజ్‌లో ఈ పోస్ట్ కనిపించటంతో అంతా అది బిగ్ బీ చేయి అనుకున్నారు. మీడియాలోనూ అమితాబ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు అమితాబ్‌ వరకు చేరటంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. తన బ్లాగ్‌లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ `కేవలం ప్రజలకు తెలియజేసేందుకు మాత్రమే ఈ ఫోటోను పోస్ట్ చేశా.. కానీ అది నా చేయి కాదు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు` అంటూ ట్వీట్ చేశాడు అమితాబ్. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో షూటింగ్ లు నిలిపివేయటంతో సినీ తారలు ఇళ్లకే పరిమతిమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: