టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా విడుదల అవుతుంది అంటే నిర్మాతలకు లాభాల పంట అనేది అందరి అభిప్రాయం. అందుకే ఆయన తో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాత లు పోటీ పడుతూ ఉంటారు. దాదాపు ఐదేళ్ల నుంచి వరుస విజయాల తో దూసుకుపోతున్న మహేష్ బాబు తో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు పోటీ పడుతూ వస్తున్నారు. ఒకటి ,రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా ఆ తర్వాత మళ్లీ హిట్ సినిమా తో రేసులో నిలుస్తున్నాడు మహేష్ బాబు.

 

ఇటీవల మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా హిట్ టాక్ ఎలా ఉన్నా సరే వసూళ్ళకు మాత్రం ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు మాత్రం మహేష్ బాబుని బాగా ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నాయి సినిమా వర్గాలు. దానికి కారణం ఏంటి అంటే సినిమా విడుదలకు ముందే మార్కెట్ మహేష్ బాబు తీసుకుంటున్నాడు దీంతో నిర్మాతలకు ఏమీ మిగలడం లేదు అనే భావన టాలీవుడ్ లో వ్యక్తమవుతోంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

 

ఈ సినిమాకు నిర్మాతగా మహేష్ బాబు ఉంటున్నాడు కోసం సినిమా మార్కెట్ లో కీలకమైన రిలీజ్ కి ముందు వ్యాపారం అంతా తానే తీసుకుంటున్నాడు. దీనితోనే ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రావడం లేదని అంటున్నారు ముఖ్యంగా అతను  దెబ్బకు స్టార్ నిర్మాతలు కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. సినిమా సినిమాకు దాదాపు 60 నుంచి 70 కోట్ల వరకు వసూలు చేస్తున్నాడని సినీ వర్గాల టాక్ అందుకే ఇప్పుడు నిర్మాతలు మహేష్ బాబు కి దూరం గా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: