తెలుగుతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన భామ ఇషా కొప్పికర్. 2000 సంవత్సరంలో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ఫిజా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి చాలా హిందీ సినిమాల్లో నటించింది. ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిన ఈ భామ ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే.. వర్మపై ఎంతో ప్రేమతో కూడిన బాధను వ్యక్తం చేస్తోంది. ఆర్జీవీ హిందీలో తీసిన కంపెనీ సినిమాలో ఇషా ఓ ముఖ్యపాత్ర పోషించింది.

 

 

‘ఆర్జీవీ ఒకప్పుడు సూపర్ టాలెంటెడ్ దర్శకుడు. బాలీవుడ్ లో హరర్ సినిమాలను కొత్తగా ప్రెజెంట్ చేసిన వ్యక్తి ఆర్జీవీ. రొమాన్స్, మాఫియాలను కూడా సమర్ధవంతంగా తీసి తన టాలెంట్ ని చూపించిన వ్యక్తి. ఆయన తీసిన రాత్రి సినిమా నాకు చాలా ఇష్టం. హిందీలో తీసిన సత్య సినిమా ఓ అద్భుతం. అలాంటి ఆర్జీవీ ఈమధ్య సరైన సినిమాలు తీయటం లేదు. ఆయనకు బ్యాడ్ పిరియడ్ నడుస్తోంది. మళ్లీ మంచి ఫామ్ తో అద్భుతమైన సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను’ అంటూ వర్మపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఇషాపై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వస్తున్నాయి. వర్మ కెరీర్లో పీక్ స్టేజ్  అయిపోయింది.. నీకెందుకు ఆ బాధ అంటూ కామెంట్లు పడుతున్నాయి.

 

 

ఇషా కొప్పికర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాగార్జున హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ సినిమాలో, వెంకటేశ్ హీరోగా వచ్చిన ప్రేమతో రా.. సినిమాల్లో నటించింది. 2004లో హిందీలో వచ్చిన గర్ల్ ఫ్రెండ్ సినిమాలో అమృత అరోరాతో కలిసి లెస్బియన్ తరహా క్యారెక్టర్ చేసి సంచలనం రేపింది. ఇషా కొప్పికర్ ఫ్యాషన్ పలు ర్యాంప్ వాక్ లో ఇప్పటికీ పాల్గొంటూ ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: