కరోనా ఎఫెక్ట్‌తో బాలీవుడ్ స్టార్స్‌ అంతా ఇంటికే పరిమిత మవుతున్నారు. షూటింగ్ లు, ప్రమోషన్ కార్యక్రమాలతో అన్ని రకాల సినీ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో టాప్‌ స్టార్స్‌ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మహమ్మారిని అడ్డుకునేందుక దేశమంత ఏకమై రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

 

అదే సమయంలో కరోనా సోకిన వాళ్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, బయట సేవలు అందిస్తున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సంఘీభావంగా అందరినీ ఇళ్ల బాల్కనీల లోకి వచ్చిన చప్పట్లు కొట్టాల్సిందిగా కోరారు ప్రధాని. దీంతో దేశ ప్రజలంతా ఒక్కతాటి మీదకు వచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.

 

అయితే ఈ కార్యక్రమానికి మద్దుతుగా పలువురు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు విమర్శల పాలయ్యాయి. పవన్‌ కళ్యాణ్, రజనీకాంత్‌ లు వైరస్‌ జీవిత కాలం విషయంలో తప్పుడు సమాచారం ట్వీట్ చేశారంటూ ట్విటర్ వారి ట్వీట్స్‌ ను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా అమితాబ్‌ కు కూడ అలాంటి అనుభవమే ఎదురైంది. చప్పట్లు కొట్టడం తరువాత వైరస్‌ శక్తిని కోల్పోతుందంటూ ట్వీట్ చేసిన అమితాబ్‌ తరువాత ఆ ట్వీట్ పై విమర్శలు రావటంతో దాన్ని తొలగించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సెలబ్రిటీలు కూడా ఇలా తప్పుడు సమాచారం ఇస్తే ఎలా అంటూ పలువురు నెటిజెన్లు విమర్శిస్తున్నారు.

 

మన దేశంలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 400 దాటగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 కిపైగా పాజిటివ్‌ కోసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: