ప్రపంచమంతా కరోనా దెబ్బకు కుదేలైపోయింది. ప్రజలంతా ఒక్కటై ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. కరోనాను అరికట్టేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే.. కరోనా ప్రభావం ఎక్కువున్న దేశాల్లో తీసుకుంటున్న చర్యలు మన దేశంలో పరిస్థితిపై టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ తనదైన సెటైర్ వేస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

 

 

చైనా, ఇటలీ, ఖతార్, కొరియా దేశాల్లో కరోనాను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వాలు ఏమేమి చర్యలు తీసుకుంటున్నాయో భారత్ లో ఏం జరుగుతుందో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీనికి చైనా, ఇటలీ, ఖతార్, కొరియా వర్సెస్ ఇండియా అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇందులో ఆయా దేశాలు అక్కడి వీధుల్లో ఫాగింగ్ చేస్తూ ఉంటే ఇండియాలో మాత్రం ప్రజలు రోడ్డు మీద డ్యాన్స్ వేస్తున్నట్టు ఉంది. ఈ వీడియో చూస్తుంటే నార్త్ ఇండియాలా ఉంది. ప్రజలు వీధుల్లో డప్పులు కొడుతున్నారు. దీనికి ప్లేబ్యాక్ లో ఓ పాటను తగిలించాడు కూడా. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

 

దీనిపై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. పూరిని నిందిస్తూనే ఎక్కువగా సైటైర్లు వేస్తున్నారు. ‘మీరు సలహా ఏదైనా ఇస్తే బాగుంటుంది కానీ.. సెటైర్లు వేయడం తగదు’, ‘దేశం నచ్చకపోతే వెళ్లిపో’ అని కొందరు అంటుంటే.. ‘ఇండియా మారదు బాస్’, ‘సరైన వీడియో పెట్టారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మన పీఎమ్ మధ్యప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారని కూడా సెటైర్లు వేస్తున్నారు. పూరి ఆలోచన ఏదైనా ప్రస్తుతం ప్రభుత్వాలా కరోనాను సీరియస్ గానే తీసుకున్నాయి. మరి పూరి వీడియో వెనుక ఉన్న మర్మమేమిటో ఆయన ఆలోచనేంటో పూరీనే చెప్పాలి.

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: