మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి..కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అభిమానులను బాగా ఆకట్టుకుంది..అయితే దేశ వ్యాప్తంగా కరోనా ఉండటంతో అభిమానులను పుట్టిన రోజు వేడుకలను జరిపించ వద్దని సూచించారు.. ఈ మేరకు అభిమానులు కూడా హీరో కోరికను తీర్చారు.. అంతేకాకుండా చరణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ లోంచి ప్రత్యేక పాత్రలను తీసుకొని ఒక పాటను రూపొందించారు.. అది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. 

 

 

 

 

అయితే కుటుంబ సభ్యులతో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న చరణ్ కు భార్య ఉపాసన అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల తన పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతోన్న సినీనటుడు రామ్‌ చరణ్‌ తన ఇంట్లో కేక్‌ కోసి చాలా సింపుల్‌ గా ఈ వేడుకను జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. చెర్రీకి ముద్దు పెట్టిన ఆయన భార్య ఉపాసన ఆయనతో కేక్‌ కట్‌ చేయించి, తినిపించింది.  

 

 

 

ప్రపంచం మొత్తం కరోనా భయం పట్టుకున్న సంగతి తెలిసిందే.. అందుకే బర్త్ డే వేడుకలు బంద్ చేసిన నేపథ్యంలో చరణ్ అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే .. ఇకపోతే చరణ్ ఇప్పుడు వరుస వినిమాలలో నటిస్తూ వస్తున్నాడు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆర్.ఆర్.ఆర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా ఇప్పుడు చిత్రీకరణలో బిజీగా ఉంది.. అల్లూరి సీతారామరాజు పాత్ర లో చరణ్ నటిస్తున్నాడు.. తాజాగా చరణ్ పుట్టిన రోజు సందర్భంగా లుక్ ను విడుదల చేసారు.. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 8 న భారీ ఎత్తునా విడుదల కానుంది.. ఆ తర్వాత చిరు, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్యలో ప్రధాన పాత్రలో నటిస్తున్న రాన్నా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: