కరోనా దెబ్బతో చివరకు స్టార్ హీరోయిన్లు సైతం విలవిల్లాడుతున్నారు. అటు పేదలు, కూలీలు, కార్మికులు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేస్తే తప్పా వీరి బాధలు తీరేలా లేవు. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ టీవీ షోలు చేసుకునే యాంకరమ్మలు, పాత స్టార్ హీరోయిన్లపై సైతం గట్టిగానే పడిందట. చాలా మంది సీనియర్లు, బుల్లితెర నటీమణులు బుల్లితెరను నమ్ముకుని గట్టిగానే సంపాదిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగి ఇప్పుడు ఇబ్బందుల నేపథ్యంలో బుల్లితెరకు వచ్చిన చాలా మంది స్టార్ హీరోయిన్ల పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందట. ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
ఇక టీవీల్లో జడ్జ్‌లు, యాంకర్లుగా కనిపించే వారు అయితే అవకాశాలు లేక ఇప్పుడు జీవనం గడవక పడుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావట. లాక్ డౌన్ తగ్గితే తప్పా వీరి బాధలు ఇప్పట్లో తీరేలా లేవని అంటున్నారు. ఇక గతంలో హీరోయిన్లుగా ఉన్న వారు.. వెండితెరపై క్యారెక్టర్ వేషాలు వేస్తూ ఓ వెలుగు వెలిగిన వారు పెద్దగా సంపాదించుకోలేని వారు చాలా మందే ఉన్నారు. ఇప్పడు వీరు జీవనం కోసం బుల్లితెరను ఆశ్రయించారు. వీరికి అనేక రకాలుగా ఉపాధి దొరుకుతోంది. ఇప్పుడు వీరికి ఉపాధి లేకపోవడంతో పడుతోన్న ఇబ్బందులు అన్నీ కావట. మరి వీరి బాధలు ఎప్పటకి తగ్గుతాయో ? చూడాలి.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple