ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో ప్రజలందరూ వారి ఇళ్లకే పరిమితం అయ్యారు. అంతేకాకుండా నటీనటులు అందరూ కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొందరు సినీ తారలు అయితే ఇంట్లో రకరకాల రుచి కరమైన వంటకాలు చేసుకొని ఆనందిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#Quarantinekathalu

A post shared by Nav Deep (@pnavdeep) on


మరికొందరు ఇంట్లో కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో  నటుడు నవదీప్ ఇంట్లో  కొత్త ప్రయోగాల మొదలుపెట్టారు. తన లుక్స్ లో కాస్త వెరైటీగా మర్చుకున్నాడు.  కోరమీసాల తో నవదీప్ అందరిని ఆకర్షిస్తున్నాడు. కూర మీసాలతో ఉన్న ఫోటోను నవదీప్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొని షేర్ చేయడం జరిగింది. నవదీప్ ఈ ఫోటోలో సిక్స్ ప్యాక్ తో ఉండడం.. కోరమీసాలతో ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది. 

 


దీనితో ఒక నెటిజన్ మీరు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా నవదీప్ సమాధానం చెబుతూ " లేదు నటించడం లేదు అని"  స్పష్టంగా తెలియజేశారు. నిజానికి ప్రేక్షకులలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఎప్పుడు ఏది బయటకు వస్తుందో అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 

 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరు ఎదురు చూసిన సినిమాల్లో మొదటిగా చెప్పుకునేది ఆర్ ఆర్ సినిమా గురించి మాత్రమే. దీనికి కారణం టాలీవుడ్ జక్కన్న గా చెప్పుకోవాలి రాజమౌళి దర్శకత్వం వహించడం మరియు ఇద్దరు పెద్ద హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించడంతో దీనికి ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ప్రస్తుతం కరోనా వైరస్ దెబ్బతో ఈ సినిమా షూటింగ్ ని వేయడం జరిగింది.కాబట్టి వీరి అభిమానులకు ఈ సినిమా గురించి ఎప్పుడు ఏ వార్త బయటకు వస్తుంది అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: