నేటి సమాజంలో భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అక్రమ సంబంధాలు, వరకట్న వేధింపులు, రెండు పెళ్ళిళ్ళు లాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తడం భారతీయ వివాహ బంధంలో సర్వసాధారణమైపోయాయి. అయితే మన తెలుగు రాష్ట్రాలలో భార్యా భర్తల మధ్య తలెత్తే సమస్యలను చక్కదిద్ది వాళ్ళని మళ్లీ ఒకటి చేసేందుకు కొన్ని బుల్లితెర షో లు పుట్టుకొచ్చాయని మన అందరికీ తెలుసు. బతుకు జట్కా బండి, సంసారం ఒక చదరంగం, రచ్చబండ లాంటి షోస్ మనం చూసినవే. అయితే జీ తెలుగులో ప్రసారం అవుతున్న బతుకు జట్కా బండికి రోజా ఎలా ఆడ పెదరాయుడు గా దంపతులకు న్యాయం చేస్తుందో... యాంకర్ శ్రీముఖి కూడా ' బతుకు బలైపోయిన బండి' అనే ఓ కార్యక్రమం ద్వారా భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తుంది. కానీ యూట్యూబ్ లో విడుదలైన ఈ కార్యక్రమం ఒక స్పూఫ్ లాంటిదని చెప్పవచ్చు.


బతుకు బలైపోయిన బండి కార్యక్రమం శ్రీముఖి తో ప్రారంభము కాగా... ఒక లేడీ వాయిస్ 'ఇది కథ కాదు కల్పితం' అని చాలా క్యూట్ గా చెబుతుంది. ఈ కార్యక్రమంలో ఎల్లో కలర్ చీర, పింకు కలర్ జాకెట్, గాజులు ధరించిన యాంకర్ శ్రీముఖి జబర్దస్త్ ముక్కు అవినాష్, పోవే పోరా యాంకర్ విష్ణు ప్రియా దంపతులకు వచ్చిన సమస్యలను తీరుస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో భార్య భర్తలు కలిసి పని చేసుకుంటే వారి మధ్య వివాహ బంధం ఎంత బలంగా తయారవుతుందో చాలా చక్కగా చూపించారు.


12 నిమిషాల 36 సెకండ్ల నిడివిగల ఈ హాస్యభరితమైన వీడియో గత 20 గంటల్లో లక్ష వీక్షణలను, సుమారు నాలుగువేల లైకులను సంపాదించింది. లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి యాంకర్ శ్రీముఖి... జబర్దస్త్ హాస్యనటుడు అవినాష్, బుల్లితెర వ్యాఖ్యాత విష్ణు ప్రియా తో ఎవరి ఇంట్లో వారిని ఉంచి వారితో ఈ వీడియో చిత్రీకరణ జరిపించింది. ప్రస్తుతం బతుకు బలైపోయిన బండి కార్యక్రమం సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ కార్యక్రమం చాలా సరదా గా హాస్య భరితంగా ఉందని నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: