భారత  దేశంలో కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... ఇంకా చాలా మంది ముందుకు వస్తున్నారు..

 

 

 

 

ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం, సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. దాంతో ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి..

 

 

 

 సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నారు. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్, బాలయ్య ,నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ కరోనా దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతలు.డిజిటల్ మాధ్యమంలో విడుదలవుతున్న సినిమాల్లో సందీప్ కిషన్ సినిమా 'నరకాసురన్‌' కూడా ఉందని తెలుస్తుంది. అరవిందస్వామి, శ్రియా శరన్‌, సందీప్ కిషన్ ప్రధాన పాత్రధారులుగా 'డీ 16' ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో 'నరకాసురుడు' పేరుతో విడుదల చేయాలనుకున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈసినిమా విడుదల వాయిదా పడుతుండటంతో అమెజాన్ లో విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నారట.. ఈ మేరకు ఏప్రిల్ 17 న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో దర్శనమిస్తోంది అని ప్రకటించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: