జాతి యావత్తూ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఏకమవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే భారత్ ఉంది. కరోనా విపత్తుకు వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ప్రజల్లోని కొన్ని వర్గాలు రోజువారీ ఉపాధి కోల్పోయారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ తమకు తోచినంత సాయం చేస్తూ ఆదుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సాయానికి నేను సైతం అంటూ ముందుకొచ్చింది ఓ బాలీవుడ్ స్టార్ డైరక్టర్ కుమార్తె. చిన్న వయసైనా తనకున్న ఆర్ట్ ని ఉపయోగించి మూగ జీవాలను ఆదుకుంటోంది.

 

 

బాలీవుడ్ స్టార్ మహిళా డైరక్టర్, డ్యాన్స్ డైరక్టర్ ఫరాఖాన్ గురించి తెలియని వారు ఉండరు. ఆమె కుమార్తె 12ఏళ్ల అన్య కు బొమ్మలు గీయడంలో నేర్పరి. ఈ విద్యనే ఉపయోగించి మొత్తం 70 జంతువుల బొమ్మలు గీసింది. తాను గీసిన ప్రతి బొమ్మకు 1000 చొప్పున మొత్తం 70వేల రూపాయలు సంపాదించింది. వారం రోజుల్లో ఈ బొమ్మలు గీసింది. తన సంపాదనను ఆహారం దొరక్క వీధుల్లో అల్లాడిపోతున్న మూగజీవాల ఆకలి తీర్చేందుకు ఉపయోగిస్తోంది. ఈమేరకు తన కూతురు ఘనతను ఫరాఖాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అన్య గీస్తున్న బొమ్మను కూడా వీడియో తీసి పోస్ట్ చేసింది.

 

 

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ‘బొమ్మలు గీయమని, జంతువుల ఫొటోలు ఇచ్చి అన్య కు సహకరించి వారందరికీ ధన్యవాదాలు’ అంటూ తన వాల్ లో రాసుకుంది ఫరాఖాన్. సాయం చేసేందుకు మనసుండాలే కానీ వయసుతో పని లేదని అన్య నిరూపించిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో టాప్ డ్యాన్స్ డైరక్టర్ గా రాణించడంతో పాటు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించింది ఫరాఖాన్. దీపికా పదుకొనేను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: