ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం భార‌త‌దేశ‌మే కాకుండా ప్ర‌ప‌చంలోని చాలా దేశాలు సైతం ఏప్రిల్ 30 వ‌ర‌కు కొంద‌రు.. మే 15 వ‌రకు మ‌రికొంద‌రు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. ఇక మ‌న‌దేశంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ మే 3వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.  ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎవ్వ‌రు బ‌య‌ట‌కు రాకుండా తీవ్ర‌మైన ఆంక్ష‌లు అమ‌లు అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌యంలో ఉచితంగా కాలింగ్‌, డేటా, టీవీ స‌ర్వీసులు అందించాల‌ని సుప్రీంకోర్టులో ఫిటిష‌న్ దాఖ‌లు అయ్యింది. ఈ క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల‌కు మొబైల్‌, టీవీ స‌ర్వీసులు ఉచితంగా అందించాల‌ని పిటిష‌న్ వేసిన మ‌నోహ‌ర్ ప్ర‌తాప్ అనే వ్య‌క్తి అమెజాన్ ఫ్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్ వీడియోల‌ను కూడా ఉచితంగా అందించాల‌ని ఫిటిష‌న్లో పేర్కొన్నాడు. ఇత‌ర వీడియో స్ట్రిమింగ్ వెబ్‌సైట్ల‌ను కూడా ఉచితంగా అందించాల‌ని.. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతోంద‌ని చెప్పాడు. మ‌రి ఇది నిజంగా అమ‌లు అవుతుందా ?  లేదా ? అన్న‌ది ప‌క్క‌న పెడితే ప్ర‌జ‌ల‌కు అంత‌కు మించిన బంప‌ర్ ఆఫ‌ర్ ఉండ‌దు క‌దా..?

మరింత సమాచారం తెలుసుకోండి: