చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఉనికి చాటుకుంటూ విలయం సృష్టిస్తోంది. దేశంలో కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించారు.  దాంతో ఎంతో మంది పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పటికే చాలాసార్లు సూచించిన తమిళ కమెడియన్ వడివేలు తాజాగా ఓ పాట వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు రక రకాల పోస్ట్ లు చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ కమెడియన్ వడివేలు చేసిన పోస్ట్ కి ప్రత్యేకత సంతరించుకుంది.

 

ప్రపంచాన్ని పీడిస్తున్న ‘కరోనా’ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటూ తాజాగా ఆయన తమిళ్ లో పాడిన పాట ఇది. ప్రపంచాన్ని ఇప్పటి వరకు పీడించింది చాలని, ఇకనైనా వదిలి వెళ్లిపోవాలంటూ ‘కరోనా’ ను తన పాట ద్వారా ఆయన కోరారు. కాగా, కరోనా’ కట్టడికి కళాకారులు తమ వంతు  విరాళం ఇవ్వడమో లేకపోతే  వివిధ కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడమో చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: