కరోనా లాక్ డౌన్ సమయంలో ఎలా టైం పాస్ చేయాలో అర్ధం కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటే. మరి కొందరు మాత్రం ఈ సమయాన్ని చాలా బాగా వాడేసుకుంటున్నారు. తమ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు ప్రిన్స్ నరులా అలాంటి పనే చేశాడు. తన భార్య నటి యువికా చౌదరిని ఆటపట్టిస్తూ ఓ ప్రాంక్ వీడియో చేశాడు ప్రిన్స్.
అయితే ప్రిన్స్ చేసిన ఈప్రయత్నం బెడిసి కొట్టింది. తన ఇన్స్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ ప్రాంక్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు ప్రిన్స్ నరులా. వీడియోలో ముందుగా ప్రిన్స్ చెపుతున్న విషయాన్ని చాలా సీరియస్‌గా విన్న యువికా తరువాత అది ప్రాంక్ తెలియంటే అతని కొడుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోతో పాటు `ప్రాంక్ వీడియో.. భార్య యువికాతో సరదాగా` అంటూ కామెంట్ చేశాడు ప్రిన్స్.
కరోనా లాక్ డౌన్ కారణంగా వచ్చిన ఖాళీ సమయాన్ని ఈ జంట చాలా బాగా వాడేసుకుంటున్నారు. లూడో ఆడటం, వర్క్ అవుట్స్ చేయటం, వంట చేయటం లాంటి పనులను ఇద్దరు కలిసి చేస్తూ ఆ వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. యువికా, ప్రిన్స్్ లు 2015లో ఓ టీవీ రియాలిటీ షోలో తొలిసారిగా కలుసుకున్నారు. 2018లో వివాహం చేసుకున్నారు.