టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత ఇబ్బంది పడిన హీరో రవి తేజా. ఒకప్పుడు రవి తేజా సినిమాలు అంటే జనాలకు ఒక రకమైన ఆసక్తి అనేది ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా తగ్గింది అంటున్నారు జనాలు. రవి తేజా తో సినిమా చేయడానికి ఒకప్పుడు ఎక్కువగా నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉండే వాళ్ళు. కాని ఇప్పుడు అలాంటి వాతావరణం ఎక్కడా కనపడటం లేదు. రవి తేజా క్రేజ్ పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. రవి తేజ సినిమా ఈ మధ్య కాలంలో హిట్ అవ్వలేదు. 

 

ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా ఈ మధ్య కాలంలో హిట్ అయిన పరిస్థితి దాదాపుగా లేదు అంటున్నారు. అయితే ఇప్పుడు రవి తేజా మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. అతని సినిమాల కోసం ఎదురు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి లేదు. ఇక ఇప్పుడు రవి తేజా సినిమాలు చెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాడు. అగ్ర దర్శకులు కూడా అతని తో సినిమా చేయడానికి ముందుకి రావడం లేదు. దీనితో సినిమా చేయడానికి అతను ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. 

 

ప్రస్తుతం... అతను ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత లేదు. అతను సినిమాల నుంచి తప్పుకోవాలి లేదా ఇతర హీరోల తో కలిసి సినిమాలు చెయ్యాలి...ఇదే మినహా కొత్త ఆలోచన అతను చేయడం లేదని సమాచారం. చిన్న చిన్న హీరోలు కూడా ధైర్యంగా సినిమాలు చేస్తున్నారు. కాని టాలీవుడ్ లో ఆయనకు ఇమేజ్ ఉండి కూడా చేయడానికి ఆలోచిస్తున్నాడు. మరి దీనికి కారణం ఏంటో రవి తేజా కే తెలియాలి. కథల ఎంపిక అతనికి రావడం లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: