ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానం అమలుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. దీని ప్రభావం సినిమా రంగం పై ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు షూటింగ్ లు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఓటిటి ద్వారా మంచి రెవెన్యూ వస్తుంది అని అర్థమవుతుంది. అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటివి  ఓటిటి లపై సినిమాలను స్ట్రీమింగ్ చేస్తే ఈ సమయంలో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. దీనితో చిన్న నిర్మాతలకు బాగా కలిసివచ్చే అవకాశం అని అంచనా కూడా వేస్తున్నారు. 

 


ఇక మన తెలుగు వాళ్ళు అమెజాన్ పైకి ఎక్కువ ఆదరణ ఇస్తారు. ఈ తరుణంలో చిన్న సినిమా నిర్మాతలు అందరూ కూడా అమెజాన్ ప్రైమ్ ను ఎంచుకోవడం జరుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే.. అసలు నిర్మాతలకు అమెజాన్ ప్రైమ్ ఎంత పే చేస్తుంది అని అన్నది చాలా హాట్  టాపిక్ గామారింది. ఇక మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువమంది అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ చేసిన తమ సినిమాని చూస్తే అంత ఎక్కువగా నిర్మాతలకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.. అంటే కేవలం న్యూస్ ని బట్టే వాళ్ళకి రెమ్యునరేషన్ అన్నమాట. ఇక కొత్త సినిమాలకు అయితే గంటకు మూడు రూపాయలు, పాత సినిమా అయితే గంటకు రెండు రూపాయలు పే చేయడం జరుగుతుంది.  ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్క నిర్మాత 80 లక్షల దాకా సంపాదించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

 


కానీ మే నెల 1 నుంచి మాత్రం అమెజాన్ ప్రైమ్ ఆ రేటు ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కొత్త సినిమాలకు 2.50, పాత సినిమాల కు 1.50 పే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏమనగా ఎక్కువ నిర్మాతలు మా సినిమాను అప్లోడ్ చేస్తామని ముందుకు రావడమే అని తెలుస్తుంది.. గతంలో అమెజాన్ పే గంటకు ఐదు రూపాయలు కూడా పే  చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం మాత్రం ఆ విధంగా పే చేసే అవకాశాలు లేవు అనే కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: