దేశంలో లాక్ డౌన్ గత నెల 24 నుంచి మొదలైన విషయం తెలిసిందే.  దాంతో సినీ పరిశ్రమ పూర్తిగా మూతపడిపోయింది. ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.. రిలీజ్ ఆగిపోయాయి.  అయితే సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటూ కరోనాపై తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరికొంత మంది వంటకాలు వండుతూ సోషల్ పోస్టులు పెడుతున్నారు. ఇక నిత్యం రాజకీయాలు, షోస్ తో బీజీగా ఉండే నగరి ఎమ్మెల్యే రోజాకు లాక్ డౌన్ కారణంగా ఖాళీ టైం దొరికింది.

 

పగలంతా కరోనా పై ప్రజల్లో అవగాహాన కల్పిస్తూనే వారికి మాస్క్‌లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు.  అంతే కాదు ఇంట్లో ఉంటూ ఇమ్యూనిటీ పరవర్ ఎలా పెంచుకోవాలా అన్న సలహా కూడా ఇస్తున్నారు.  ఇంతకుముందే అవకాయ పచ్చడి చేసిన రోజా ఇప్పుడు చికెన్ పచ్చడి చేశారు. చికెన్ పచ్చడి తయారీ విధానాన్ని వివరించారు. చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో వివరించారు.

 

ప్రారంభం నుంచి పచ్చడి అయ్యేంత వరకు ఎలా చేసుకోవాలో స్పష్టంగా వివరించారు.   కరోనాకు భయపడకండి.. మనం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం.. ఇక కరోనా   సోకకుండా ఉండాలంటే ప్రోటీన్స్ తింటూ ఇమ్యూనిటీని పెంచుకోవాలన్నారు ఎమ్మెల్యే రోజా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్ ను అందరూ ఖచ్చితంగా పాటించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: