యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి విసిరిన బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ ను స్వీకరించడంతో పాటు ఛాలెంజ్ ను పూర్తి చేసి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూనియర్ ఇళ్లు తుడిచి, అంట్లు శుభ్రం చేసి, గార్డెన్ ను క్లీన్ చేసి బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. అనంతరం బాలయ్య బాబాయ్ ను బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. 
 
ఎన్టీయార్ ఛాలెంజ్ పట్ల బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జూనియర్ ట్విట్టర్ ఖాతా ద్వారా " మన ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం" అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. జూనియర్ బాలయ్యతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, దర్శకుడు కొరటాల శివలను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. నిన్న సాయంత్రం ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నానని పోస్ట్ చేసిన జూనియర్ కొన్ని గంటల్లోనే ఛాలెంజ్ ను పూర్తి చేసి మరికొంతమందికి ఛాలెంజ్ విసిరారు. 
 
మొదట అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇంటి పనులు చేస్తూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసుకుని దర్శక ధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ ను స్వీకరించిన రాజమౌళి ఇల్లు ఊడుస్తూ, కిటికీలు, తలుపులు శుభ్రం చేస్తూ, బండలు తుడుస్తూ ఛాలెంజ్ ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీయార్ ఇప్పటికే ఛాలెంజ్ ను పూర్తి చేయగా చరణ్ ఛాలెంజ్ ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాల్సి ఉంది. 
 
లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన మగవాళ్లు పనివాళ్లు అందుబాటులో లేని సమయంలో స్త్రీలకు సహాయసహకారాలను అందించాలని సూచిస్తూ బీ ది రియల్ మాన్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఎన్టీయార్ విసిరిన ఛాలెంజ్ పట్ల ఎవరు ఎలా స్పందిస్తారో తెలియాలంటే మాత్రం కొన్ని గంటలు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: