ప్ర‌స్తుతం సినిమా వాళ్ల‌కు షూటింగ్‌లు బంద్ అవ్వ‌డంతో చాలా మంది ఇళ్ల‌లోనే స్వీయ నిర్బంధానికి ప‌రిమితం అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఇళ్ల‌ల్లో త‌మ కుటుంబానికి ఇంటి ప‌ని, వంట ప‌నిలో సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొంద‌రు ఇంటి , వంట ప‌నిలో త‌మ కుటుంబాల‌కు చేసిన సాయాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 

ఈ క్ర‌మంలోనే రాశీ ఖ‌న్నా లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇంటికి ప‌రిమిత‌మైన వేళ ఓ వెబ్ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమె తన తొలి డేటింగ్ విశేషాల్ని బయటపెట్టింది హీరోయిన్ రాశిఖన్నా. త‌న తొలి ప్రేమ అనుభూతుల‌ను పంచుకున్న ఆమె అది డేటింగ్ అన్న విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. అప్పుడెప్పుడో అలా జ‌రిగిపోయింద‌ని రాశీ చెప్పింది. ఆ డేటింగ్ టైంలో త‌న‌కు 16 ఏళ్లు అని.. స‌ద‌రు వ్య‌క్తి తన పుట్టినరోజు అని చెప్పి పార్టీ ఇస్తానంటే వెళ్లాన‌ని నాటి అనుభూతులు పంచుకుంది.

 

వాళ్ల ఇంటి ద‌గ్గ‌ర్లోనే ఉండే మెక్ డొనాల్డ్స్ కేఫ్‌కు వెళ్లామ‌ని.. అప్పటికే మంచి ఆకలి మీద ఉన్నాను. ఫుల్ గా ఆర్డర్ ఇచ్చి నచ్చినవన్నీ తినేశాను. బిల్లు అతడే కట్టాడు. రెస్టారెంట్ లో ఉన్నంతసేపు నన్ను పొగుడుతూనే ఉన్నాను. నేనేం మాట్లాడలేదు. జస్ట్ స్మైల్ మాత్రమే ఇచ్చాను. అలా నా ఫస్ట్ డేట్ ముగిసింది. ఆ అబ్బాయి మాత్రం చాలా మంచోడ‌ని అలా త‌న ఫ‌స్ట్ డేట్ సీక్రెట్లు రాశీ బ య‌ట పెట్టింది.  16 ఏళ్ల వయసులో జరిగిన ఆ మీటింగ్ తన ఫస్ట్ అండ్ లాస్ట్ డేట్ అంటోంది రాశిఖన్నా. ఆ త‌ర్వాత తాను ఎప్పుడూ మ‌ళ్లీ డేట్ కు వెళ్ల‌లేని కూడా చెప్పింది. ఇక ఊహ‌లు గుస‌గుస లాడే వేళ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన రాశీ ఇక్క‌డ బాగా పాతుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: