కొన్ని కొన్ని కాంబినేషన్లు సినిమాపై హైప్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరో, హీరోయిన్లు కలిసి నటిస్తుంటే సినిమా పై క్రేజ్ పెరిగిపోతుంది. సినిమా ఓపెనింగ్ నుంచి ఇద్దరి నుంచి వచ్చే ఏ స్టిల్ అయినా అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులు కూడా కొత్తగా ఫీల్ అవుతారు. టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న హీరో పవన్ కల్యాణ్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్ నయనతార. వీరిద్దరి జోడీ ఇంతవరకూ తెరకెక్కలేదు. కానీ.. వీరిద్దరిని తెరపై జంటగా చూడాలనే అభిమానులకు కొదవ లేదు.

 

 

ఏ సినిమాకైనా హీరో, హీరోయిన్ కాంబినేషన్ చూడముచ్చటగా ఉంటే సినిమా రిజల్ట్ కు మించి ఆదరణ ఉంటుంది. పవన్ కల్యాణ్నయనతార కాంబినేషన్ కూడా అటువంటిదే. పవన్ రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఏ దర్శకుడు, నిర్మాత కూడా వీరి కాంబినేషన్ సెట్ చేయలేకపోయారు. హీరోలకు స్టార్ స్టేటస్ ఉన్నంత ఎక్కువ టర్మ్ హీరోయిన్లకు ఉండదు. కానీ.. నయనతార ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లు దాటుతోంది. మునుపటి కంటే మరింత స్టార్ ఇమేజ్ ప్రస్తుతం ఉంది. మంచి గ్లామర్ ఆమె సొంతం. ఈ సమయంలో వీరిద్దరి జోడీ మరింత అందంగా ఉంటుందనే చెప్పాలి.

 

 

నిజానికి నిర్మాత ఏఎం రత్నం తమిళ దర్శకుడు నేసన్ తో పవన్ సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతార పేరే వినిపించింది. కానీ.. ఆ సినిమా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఏఎం రత్నం నిర్మాతగానే పవన్ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు. హీరోయిన్ గా నయన్ పేరు ప్రస్తావనలో లేదు. కానీ.. పవన్ – నయన్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాకు భారీ క్రేజ్ వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: