కరోనా.. . ఎవరి నోటా కూడా ఒకటే మాట . కరోనా ఒక జబ్బు కాదు అనేక జబ్బుల సమ్మేళనం.. ఒక సారి కనుక ఈ కరోనా వైరస్ సోకితే జబ్బు దగ్గు  జ్వరం అంటూ ఇలా వరుస పెట్టి అన్నీ వస్తుంటాయి. అందుకే కారో పేరు వినగానే సకల జీవులు భయానికి గురవుతున్నారు. కరోనా ప్రభావం ప్రపంచాన్ని ఎంతగా తలక్రిందులు చేస్తుందో తెలిసిన విషయమే.. 

 

 

 

లాక్ డౌన్ లో ఉన్న ప్రజల ను ఆదు కోవడాని కి సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొస్తున్నారు. దీంతో పేదల ఆకలి కొంతవరకై నా తగ్గుతుంది..  ఈ విషయం లో మాత్రం సినీ తారలు నిజంగా గ్రెట్ అని చెప్పాలి. సినిమాలు వాయిదా పడిన నేపథ్యం లో  ఇళ్ల లో నే ఉంటూ ప్రజలకు కరోనా ఆ పై అవగాహ నా కల్పిస్తున్నారు. ప్రజలలో వారి స్థానం మరింత పెరగడానికి సోసిల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. 

 

 

 

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి పెద్ద మనసును చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, దివ్యాంగులకు, మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి బాలకృష్ణ ప్రత్యేకంగా రూపొందించిన ప్యాక్ లను అందించారు.

 

 

 

 


తమ సంస్థలో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహకంగా ఈ ప్యాక్ లు అందించినట్టు బాలకృష్ణ తెలిపారు. కాగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆవరణలోని హాస్టల్ లో ఉంటున్న మెడికల్, పారా మెడికల్ సిబ్బందికి, ఇతర సిబ్బందికి నిత్యం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ముగిసేంత వరకు ఉచిత భోజన ఏర్పాట్లు ఉంటాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.దీంతో నందమూరి  అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: