టాలీవుడ్ లో ప్రేక్షకులు ఇప్పడు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్సినిమా ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా కొంత భాగ౦ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది కరోనా తగ్గిన తర్వాత ఆ సినిమాను షూటింగ్ ని రాజమౌళి పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం వేరే సినిమాలను కూడా ఈ ఇద్దరు వదులుకుని మరీ కష్టపడుతున్నారు. 

 

ఈ సినిమాను ఇప్పుడు మూడు సార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. టాలీవుడ్ లో ఈ సినిమా కోసం చాలా మంది తమ సినిమాలను కూడా విడుదల వాయిదా వేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ ని వాయిదా వేసే ఆలోచనలో జక్కన్న ఉన్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నిర్మాతతో కూడా ఆయన చర్చలు జరిపారని అంటున్నారు. ముందు వాయిదా పడుతుందని ప్రచారం జరిగినా సరే లేదు తాను అనుకున్న సమయానికి కచ్చితంగా విడుదల చేస్తా అని చెప్పాడు. 

 

కాని ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా కనపడటం లేదు. ఈ సినిమాను వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. హీరోలు కూడా వాయిదా వేస్తేనే మంచిది అనే సలహాలను జక్కన్న కు ఇచ్చారని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులను చిత్ర యూనిట్ పూర్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: