దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు నయనతార అనే. ముఖ్యంగా ఆమెకు తమిళ్ లో స్టార్ హీరోతో సరిసమానమైన రేంజ్ ఉంది. ఆమె నటించే సినిమాలకు అక్కడి ఫ్యాన్స్ కట్టే కటౌట్లు చూస్తే పరిస్థితి అర్ధమవుతుంది. ఇంతటి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న హీరోయిన్ ప్రజంట్ జనరేషన్ లో ఎవరూ లేరనే చెప్పాలి. అయితే.. మొదట్లో తనకు సినిమాలు చేసే ఉద్దేశం లేదని చెప్పుకొస్తోంది. దీనిపై పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.

 

 

‘2003లో మళయాళం సినిమా ‘మనసినక్కరే’లో నాకు మొదటి అవకాశం వచ్చింది. వచ్చిన ఆ అవకాశాన్ని వద్దనుకున్నాను. నాకు మోడలింగ్ పై ఉన్న ఇష్టం సినిమాలపై లేకపోవడమే అందుకు కారణం. కానీ.. నిర్మాత, దర్శకుడు పట్టుబట్టడంతో తొలి సినిమా చేశాను. ఇక మళ్లీ సినిమాలు చేయకూడదనుకున్నాను. కానీ.. ఆ సినమా సూపర్ హిట్ అయిపోయింది. ఏకంగా 8 సినిమా ఆఫర్లు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. ఈ 17 ఏళ్లలో ఎన్నో మంచి చిత్రాల్లో నటించాను. వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాను కానీ.. అవకాశాలు రాకపోవడమనేది ఇన్నేళ్లలో జరగలేదు’ అని తన సినీ ప్రస్థానం గురించి చెప్పుకొచ్చింది.

 

 

కెరీర్లో ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుందో అన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది. ముఖ్యంగా శింబు, ప్రభుదేవాలతో లవ్ ఎఫైర్లు ఆమెకు ఓ మచ్చగా మిగిలిపోయాయి. కానీ.. అవేమీ ఆమె కెరీర్ కు అడ్డు రాలేదు. ప్రభుదేవాతో బ్రేక్ అప్ తర్వాత ఆమె కెరీర్ పీక్స్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం రజినీకాంత్ తో ఓ సినిమా, విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఆమె విఘ్నేశ్ తో లవ్ అఫైర్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: